Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Jail: జైల్లో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంది? వీఐపీలకు జైల్లో సౌకర్యాలు ఎలా ఉంటాయో...

Chandrababu Jail: జైల్లో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంది? వీఐపీలకు జైల్లో సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలుసా?

Chandrababu Jail: చంద్రబాబుకు రిమాండ్ విధించి దాదాపు పక్షం రోజులు సమీపిస్తోంది. ఇంకా ఎన్నిరోజులు రిమాండ్ కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. అత్యంత ఎన్ఎస్జి కమాండోల భద్రత మధ్య ఉండే ఆయన.. ప్రస్తుతం సెంట్రల్ జైలు సిబ్బంది భద్రత లోనే కొనసాగుతున్నారు. దీంతో ఆయన భద్రతపై ఆందోళన నెలకొంది. అన్ని వర్గాల నుంచి సానుభూతి వ్యక్తం అవుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉండే ఆయన.. జైలులో ఎలా ఉన్నారో అంటూ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం 1800 మంది ఖైదీలు ఉన్నారు. అందులో కరుడుగట్టిన నేరస్తులు సైతం ఖైదీలుగా కొనసాగుతున్నారు. అటువంటి జైల్లో రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన చంద్రబాబును ఉంచడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ 15 మందితో చిన్నపాటి కర్రలతో కాపలా కాయించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం జైలులో 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్నవారితో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ ఎస్ జి భద్రతలో ఉన్న చంద్రబాబుకు షిఫ్టులవారీగా చేతిలో కర్రలతో భద్రత కల్పిస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు దూకుడుగా వ్యవహరించాయి. చంద్రబాబు పర్యటనలను సైతం అడ్డుకున్నాయి. దీంతో చంద్రబాబుకు కేంద్రం భద్రతను పెంచింది. అప్పటివరకు 6+6 కమెండోల భద్రత ఉండేది. దానిని 12+12 కమెండోల భద్రతకు పెంచారు. ఇటువంటి తరుణంలో ఆయనకు రిమాండ్ విధించినప్పుడు అదే స్థాయిలో భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంది. రాజకీయంగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భద్రత పెంచాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంది. దీనిపై ఎన్ఎస్జి సైతం నివ్వెర పోయినట్లు తెలుస్తోంది.

అటు జైల్లో సైతం వసతులు అంతంత మాత్రమే. చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో వసతులు మెరుగుపరచాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. కానీ అవి ఎక్కడ అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం చంద్రబాబు జైల్లోని స్నేహ బ్లాక్ లో ఉన్నారు. అంతకుముందు ఆ బ్లాక్ ను మానసిక రుగ్మతలతో బాధపడే ఖైదీలకు వినియోగించేవారు. ప్రస్తుతం ఆ బ్లాక్ లోని ఒక గదిని చంద్రబాబు కేటాయించారు. బ్యారక్ చుట్టూ చెట్లు ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఒక రిమాండ్ ఖైదీ డెంగ్యూ బారిన పడి మృతి చెందారు. దీనిపై చంద్రబాబు తనయుడు లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో చంద్రబాబును చంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 14 ఏళ్ల పాటు సీఎం గా పని చేసిన చంద్రబాబు ఇలా అరకొర సౌకర్యాల మధ్య జైలు జీవితం గడుపుతుండడాన్ని టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular