Kurnool bus accident video: చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది మెలకువ వచ్చి బయటికి దూకే ప్రయత్నంలో గాయపడ్డారు. ఇంకొంతమంది అద్దాలను బద్దలు కొట్టి అమాంతం బయట దూకేశారు కర్నూలు కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పై సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి.
కావేరి ట్రావెల్స్ బస్సు నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. హైదరాబాద్ నగరంలో పలు స్టాపులలో ప్రయాణికులను ఎక్కించుకుంది. ఆ తర్వాత పటాన్చెరువు ప్రాంతం నుంచి బయలుదేరింది. ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. కావేరి ట్రావెల్స్ బస్సు కు డయ్యూ డామన్ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేశారని ఏపీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాయాలు మితిమీరిన వేగం, నిషేధ ప్రాంతాల్లోకి ప్రవేశించడం.. వంటి వాటికి పాల్పడిన నేపథ్యంలో కావేరి ట్రావెల్స్ బస్సు మీద చలాన్ లను అధికారులు నమోదు చేశారు. ఇంతవరకు వాటిని కావేరి ట్రావెల్స్ యాజమాన్యం చెల్లించలేదు. దీనికి తోడు ప్రమాదం జరిగిన తర్వాత ఒక డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ప్రమాదంలో 19 మంది దాకా చనిపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్టు ఏపీ వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా డిఎన్ఏ శాంపిల్స్ కూడా సేకరించారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షలు.. గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున వారికి సహాయం చేస్తామని మాట ఇచ్చారు.
ఈ ప్రమాదం ఓ ద్విచక్ర వాహనదారుడు వల్ల చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. హైవే మీద ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్లో రావటం.. అతడి బైక్ ను బస్సు ఢీకొట్టడం.. ఆ బైకు వెళ్లి నేరుగా బస్సు డీజిల్ ట్యాంకర్ కు తగలడంతో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి కృత్రిమ మేధ ద్వారా వీడియోను రూపొందించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. జాతీయ రహదారి మీద కావేరి ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకుపోతోంది. ఇంతలోనే రాంగ్ రూట్లో వచ్చిన బైక్ ను ఆ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బైక్ నేరుగా బస్సు కిందికి వెళ్లిపోయింది. బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. బస్సు వేగంగా పరుగులు పెడుతుండడంతో నిప్పురవ్వలు రేగాయి. అవి కాస్త డీజిల్ ట్యాంకర్ కు అంటుకున్నాయి. చూస్తుండగానే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. వాస్తవానికి డ్రైవర్ గనక అప్రమత్తంగా ఉండి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. కానీ ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్ల ఇంతటి దారుణం జరిగింది. మంటల తాకిడి వల్ల బస్సులో ఉన్న హైడ్రాలిక్ వైర్లు కాలిపోయాయి. దీంతో ఎంట్రీ డోర్ తెరుచుకోలేదు. కొంతమంది ప్రయాణికులు ధైర్యం చేసి అద్దాలు బద్దలు కొట్టారు. కిటికీలో నుంచి బయటికి దూకేశారు. అలా బయటకు దూకే క్రమంలో వారు గాయపడ్డారు.
బైక్ను ఢీ కొనడంతో బస్సులో చెలరేగిన మంటలు
మంటల్లో చిక్కుకుని దాదాపు 20 మంది మృతి..!
బస్సు ఆక్సిడెంట్ గ్రాఫిక్స్ (AI Video) https://t.co/bek7xZYDLW pic.twitter.com/jfB8zJVoty
— ChotaNews App (@ChotaNewsApp) October 24, 2025