Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆదివారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈ రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తారు. ఈ కారణంగా ఈరోజు సౌభాగ్య యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అధిక లాభాలు ఉంటాయి. మరొకొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
స్నేహితులకు ఆర్థిక సాయం చేస్తారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. కొందరు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందుతారు.
వృషభ రాశి:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి:
కొన్ని వ్యాధులు ఇబ్బంది పెడతాయి. సమాజంలో గుర్తింపు కోసం ఆరాటపడుతారు. ఇతరుల నుంచి ఆకస్మిక సాయం పొందుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి:
తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సౌకర్యాల కోసం డబ్బు అధికంగా ఖర్చు చేస్తారు. వ్యాపారులు కీలక ఒప్పందాలు చేసుకుంటారు.
సింహారాశి:
వ్యాపారులు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటతీరు మెరుగుపరుచుకోవాలి. స్నేహితుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
కన్య రాశి:
శారీరక సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రజా సంక్షేమమైన పనులు చేస్తారు.
తుల రాశి:
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనిని ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవాలి.
వృశ్చిక రాశి:
వివాహ ప్రతిపాదనలు సక్సెస్ అవుతాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
ధనస్సు రాశి:
ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు.
మకర రాశి:
కొత్త పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రులకు సేవ చేయడంలో ముందు ఉంటారు. విలువైన వస్తువుల విషయంతో కేర్ తీసుకోవాలి.
కుంభరాశి:
వ్యాపారులు పెట్టుబడులు భవిష్యత్ లో లాభాలు ఇస్తాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత పరిచయాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి:
విహార యాత్రలు ప్లాన్ చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రుణాల రికవరీ కోసం కృషి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు.