Vangalapudi Anitha: వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ డోస్ పెంచింది. లడ్డు వివాదం నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే నాటకీయ పరిణామాల నడుమ చివరి నిమిషంలో జగన్ తిరుమల పర్యటన రద్దు అయ్యింది. అయితే తాను తిరుమల ఎందుకు వెళ్ళలేదో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుకొచ్చారు జగన్. తనకు నోటీసులు ఇవ్వడం వల్లే తిరుమల వెళ్లేందుకు వెనుకడుగు వేసినట్లు జగన్ ప్రకటించారు. తన పర్యటన వెనుక కుట్రలు జరిగాయని.. వైసీపీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఎత్తుగడవేశారని.. ఇలా రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ ను చదువుతానని.. బయటకు వస్తే అన్ని మతాల ఆచారాలను గౌరవిస్తానని.. హిందూ మతాన్ని ఆచరిస్తానని జగన్ ప్రకటించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబు వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చారని మండిపడ్డారు. అయితే దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది తెలుగుదేశం. కేవలం డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ భయపడటం వల్లే వెనక్కి తగ్గాలని చెప్పుకొచ్చారు. అంతకుమించి ఏమీ లేదన్నారు. ఇస్తే గతంలో ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న వస్తుందని.. మతపరమైన విభేదాలు వస్తాయని తెలిసి జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా.. తిరుమలనుంచి పారిపోయారని ఎద్దేవా చేస్తున్నారు కూటమి పార్టీల నేతలు.
* జగన్ కు నోటీసులు ఇవ్వలే
తాజాగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు జగన్కు నోటీసులు ఇవ్వలేదన్నారు. ఇస్తే చూపించాలని డిమాండ్ చేశారు. జగన్ ఆడుతున్నది డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు కూడా చేశారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళితే.. తాను తన తల్లికి, చెల్లికి పట్టించిన గతే అవుతుందని ఎద్దేవా చేశారు. తిరుమలలో గురించి మాట్లాడుతున్న జగన్ ఏనాడైనా దాని రుచి చూశారా? అని ప్రశ్నించారు. పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని.. దానికి కారణం చెప్పలేక ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు అనిత.
* శాంతి భద్రతల కోసమే
లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల పరిసర ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు అనిత. కానీ తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని.. ఎవర్ని గృహనిర్బంధం చేయలేదని.. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చేందుకు ఇష్టం లేకే జగన్ ఇలా నాటకం ఆడుతున్నారని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. సెల్ఫ్ గోల్స్ తో తనని తాను దేశ బహిష్కరణ చేసే పరిస్థితిని జగనే తెచ్చుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. జగన్ కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టి పక్కన పడేయడం.. అక్షింతలు వేస్తే తల దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యాక్ట్ అమలు చేస్తే.
.. అది తన గురించి అనుకుంటే ఎలా అని అనిత ప్రశ్నించారు.
* సెటైరికల్ గా కామెంట్స్
మరోవైపు అనిత సెటైరికల్ గా మాట్లాడడం విశేషం. దేవుడైన సరే తన గుమ్మం ముందుకు రావాలనే తత్వం జగన్ ది అని ఆరోపించారు. అందుకే ఇంటివద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నా మతం మానవత్వం అని చెప్పిన జగన్ తల్లి, చెల్లిని చూస్తేనే ఆయన మానవత్వం అర్థం అవుతుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అనిత.