Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: ఏపీ నేతలను ఉతికి ఆరేస్తున్న పాట.. టాప్‌ ట్రెండింగ్‌లో.. మీరు విన్నారా?

AP Politics: ఏపీ నేతలను ఉతికి ఆరేస్తున్న పాట.. టాప్‌ ట్రెండింగ్‌లో.. మీరు విన్నారా?

AP Politics: లోక్‌సభ ఎన్నికలకు వేళవుతోంది. మరో వారం రోజుల్లో షెడ్యూల్‌ రావడం ఖాయమని ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలను ఎలక్షన్‌ ఫీవర్‌ వెంటాడుతోంది. ఎన్నికల సందడితో వేసవికి ముందే వాతావరణం వేడెక్కుతోంది. ఇక సిని పరిశ్రమను కూడా ఎన్నికల వాతావరణ కోసం వాడుకోవడం మొదలు పెట్టాయి పార్టీలు. ఈ క్రమంలో ఎన్నికల ప్రసంగాలను, రాజకీయ నేతలు చేసే స్పీచ్‌లోని హుక్‌ ట్యాగ్స్‌ తీసుకొని రూపొందించిన ఓ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేఐస్తోంది. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలను, సినీ తారలను టార్గెట్‌ చేస్తూ ఓ సినీ రచయిత రాసిన పాట. ప్రస్తుతం ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉంది.

సౌత్‌ హీరో ఉపేంద్ర చిత్రంలో..
దక్షిణాదిలో సంచలన నటుడిగా ఉపేంద్రకు గుర్తింపు ఉంది. తాజాగా ఆయన చిత్రం యూఐ. గతంలో ఏ, ఉపేంద్రలాంటి చిత్రాలతో తెలుగులో సంచలన విజయాలు «సాధించాడు. తాజాగా ఆయన యూఐ సీనిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఉపేంద్రతోపాటు రిష్మా నన్నయ్య, సన్నీలియోన్, జిషుసేన్‌గుపన్తా, మురళీశర్మ ఇంద్రజిత్‌ లోకేష్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకు అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలోని పాటే..
యూఐ సినిమా కోసం రాసిన పాట ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగంలో వాడిన మనల్నెవడురా ఆపేది.. నేను ఉన్నానంటూ ముద్దులు ఇచ్చే వైఎస్‌.జగన్‌ అంటూ.. కుర్చి మడతపెట్టి అంటూ చంద్రబాబు ఇటీవల వాడిన డైలాగ్స్, పాలు అమ్మిన, పూలు అమ్మిన అనే మల్లారెడ్డి సెన్సేషనల్‌ డైలాగ్స్‌తో ఈ పాట క్రేజీగా ఉంది.

బాలయ్య డైలాగ్స్‌తో..
ఇక ఈపాట నాయకులతో ఆగలేదు. వైరల్‌ కంటెంటు గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. ఏవేవో అనుకుంటాం. అన్నీ అవుతాయా? అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ను పాట కోసం వాడుకోవడంతో మరింత క్రేజీగా మారింది. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్‌ హుక్‌ డైలాగ్‌.. రెండు చేతులు జేబులో పెట్టుకుని ఎక్కడికో వెళ్తా అంటూ త్రివిక్రమ్‌ మాటలు, వర్త్‌ వర్మ అంటూ ఇటీవల క్రేజీగా మారిన డైలాగ్స్‌ పాటలో పొందుపర్చారు. అల్లు అర్జున్‌ జై బాలయ్య అంటూ చెప్పిన డైలాగ్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది.

రూ.100 కోట్లతో సినిమా..
రెండు రోజులుగా ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. సోషల్‌ మీడియాలో మీమర్స్, ట్రోలర్స్‌ ఈ పాటను ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు మంచి ప్రమోషన్‌ లభిస్తుంది. వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ బ్యానర్‌పై ఈ మూవీని జీ.మనోహరన్, శ్రీకాంత్‌ కేపీ నిర్మించారు. ఈ సినిమాకు ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించారు. వేణుగోపాల్‌ హెచ్‌సీ సినిమాటోగ్రాఫర్‌గా, విజయ్‌రాజ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కాబోతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular