Homeఆంధ్రప్రదేశ్‌Manjula Reddy : మాచర్లలో రక్తం చిందించిన మహిళకు నామినేటెడ్ పోస్ట్

Manjula Reddy : మాచర్లలో రక్తం చిందించిన మహిళకు నామినేటెడ్ పోస్ట్

Manjula Reddy : ఏపీలో నామినేటెడ్ పదవులు ప్రకటించారు. నిన్ననే రెండో జాబితాను వెల్లడించారు. మూడు పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే కొన్ని ఎంపికలు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా ప్రకటించారు. ఆయనను ప్రత్యేక సలహాదారుడిగా నియమించారు. అదే సమయంలో సీనియారిటీ, సిన్సియారిటీకి పెద్దపీట వేశారు. ఈ క్రమంలో విజయవాడలోని ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్ అండ్ కల్చరల్ సొసైటీ చైర్ పర్సన్ గా మంజులారెడ్డిని నియమించారు. ఈమె ఎవరో కాదు ఈ ఎన్నికల్లో వైసీపీ అల్లరిముకల దాడిలో గాయపడ్డారు. అదరలేదు.. బెదరలేదు. పోలింగ్ ఏజెంట్ గా కూర్చుని టిడిపి శ్రేణుల్లో ధైర్యం నింపారు. పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు ఎదురొడ్డారు. జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు గుర్తించి మరి నామినేటెడ్ పోస్ట్ ప్రకటించారు.

* పిన్నెల్లి సోదరులతో విభేదించి
మంజులా రెడ్డి తొలుత వైసీపీలోనే కొనసాగే వారు. ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. అయితే మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు నచ్చక టిడిపిలో చేరారు. ఆమె టిడిపిలో చేరడం పిన్నెల్లి సోదరులకు ఇష్టం లేదు. ఎలాగైనా అణచి వేయాలని భావించారు. చాలా రకాలుగా భయపెట్టారు. ఈ క్రమంలో ఎన్నికలవేళ రెంటాల గ్రామ పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో నేనున్నాను అంటూ ధైర్యంగా ముందుకు వచ్చారు మంజులారెడ్డి. ఎన్నికల రోజు ఉదయం పోలింగ్ సమయానికి ఏజెంట్ గా ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే వైసిపి మూకలు రెచ్చిపోయాయి. దాడులకు తెగబడ్డాయి.వేట కొడవళ్ళతో దాడులు చేశారు. ఈ ఘటనలో ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. కానీ మంజులా రెడ్డి మాత్రం పోలింగ్ బూత్ లోనే ఏజెంట్ గా కూర్చున్నారు. నుదుటిపై రక్తం కారుతున్న లెక్క చేయలేదు. ఆమె సాహసానికి అప్పట్లో చంద్రబాబు సైతం అభినందనలు తెలిపారు. ఇప్పుడు పదవి ఇచ్చి గౌరవించారు.

* ఆమె ధైర్యానికి గుర్తింపు
ఈ ఎన్నికల సమయంలో అట్టుడికిన నియోజకవర్గం మాచర్ల. చాలా రకాల విధ్వంసాలు అక్కడ జరిగాయి. పిన్నెల్లి సోదరులు అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ బూతుల్లోకి వెళ్లి మరి ఈవీఎంలను ధ్వంసం చేశారు. వివి ప్యాట్లను నాశనం చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చాలా కాలం పాటు నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. కానీ మాచర్లలో అడుగుపెట్టే సాహసం చేయలేదు. అయితే టిడిపి వీరోచిత పోరాటానికి మాత్రం నాంది పలికారు మంజులా రెడ్డి. అటువంటి మహిళా నేత సేవలను గుర్తించింది టిడిపి హై కమాండ్. మంజులా రెడ్డి ఎంపిక విషయంలో మాత్రం టిడిపి అధిష్టానం అభినందనలు అందుకుంటోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version