Vijayawada Durga Temple: తిరుమల లడ్డు వివాదం ముగిసిందో లేదో.. ఇప్పుడు తెరపైకి మరో వివాదం వచ్చింది.. ఏపీలో తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయాలలో దుర్గమ్మ గుడి ఒకటి. విజయవాడలో ఉండే ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. దసరా సమయంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో అమ్మవారి దర్శనానికి లక్షలాది భక్తులు వస్తుంటారు. ఇసుక వేస్తే రాలనంత తీరుగా విజయవాడ నగరాన్ని మార్చుతుంటారు. ఇక భవానిల దీక్షలు సరే సరే. ఆ సందర్భంలో విజయవాడ నగరం పూర్తిగా ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రకీలాద్రి భక్తుల రాకతో సందడిగా ఉంటుంది. అయితే ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో భక్తులకు లడ్డూ ప్రసాదం అందిస్తారు. ఈ లడ్డూ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. అమ్మవారి ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. భక్తుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని దుర్గమ్మ దేవస్థానం అధికారులు పలు ప్రాంతాలలో లడ్డు కౌంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్, ఇతర ప్రాంతాలలో లడ్డు కౌంటర్లు ఉన్నాయి.
అమ్మ ప్రసాదంలో వెంట్రుకలు
ఎంతో ప్రాశస్త్యం ఉన్న విజయవాడ దుర్గమ్మ లడ్డుప్రసాదంలో ఆదివారం కనిపించింది. ఓ భక్తుడు అమ్మవారి దర్శనానికి వెళ్లి.. దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశాడు. లడ్డు ప్రసాదాన్ని తినడానికి ప్రయత్నించగా ఇందులో అతడికి వెంట్రుక కనిపించింది. పైగా ఆ లడ్డులో నాణ్యత ఏమాత్రం లేదు. దీంతో అతడికి ఒళ్ళు మండి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పోస్ట్ చేశాడు..” నేను ఎక్కడి నుంచో విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చాను. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశాను. ఆ లడ్డును తినడానికి ప్రయత్నించగా అందులో వెంట్రుకలు కనిపించాయి. లడ్డులో నాణ్యత కూడా సరిగ్గా లేదు. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయాను. నేను ఎంతో ఇష్టపడి లడ్డును కొనుగోలు చేస్తే ఇలా జరిగిపోయింది. అతడు ఏపీ దేవాదాయ శాఖ మంత్రిని ట్యాగ్ చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. మంత్రి స్పందించక తప్పలేదు. భక్తుడికి ఎదురైన అనుభవానికి క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇటువంటి తప్పు జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఆలయాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తామని వెల్లడించారు..” ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దుర్గమ్మ ప్రసాదంలో నాణ్యత లేదని అతడు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ విషయం నా దృష్టికి వచ్చింది. కచ్చితంగా ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తాను. త్వరలోనే అధికారులతో కలిసి దుర్గమ్మ ఆలయాన్ని సందర్శిస్తాను. ఆ భక్తుడికి ఎదురైన ఇబ్బంది నేను అర్థం చేసుకున్నాను. అతడికి క్షమాపణలు చెబుతున్నానని” మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.. దుర్గమ్మ ప్రసాదం తయారీలో నాణ్యత లేదని.. చివరికి వెంట్రుకలు కూడా వస్తున్నాయని.. ఈ విషయంపై కూటమి నాయకులు స్పందించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.