Sandeep Reddy Vanga: రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. దేశవ్యాప్తంగా తన బోల్డ్ మేకింగ్ తో సంచలనం సృష్టించిన సందీప్ వంగ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతుండడమే ఈ సినిమా పై ఇంత క్రేజ్ పెరగడానికి కారణం అని చెప్పొచ్చు. ‘యానిమల్’ చిత్రం తో ఆయన బాలీవుడ్ ఆడియన్స్ మతి పోగెట్టేసాడు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డ్ గా సినిమాలు తీసి సంచలనం సృష్టించేవాడు, ఈ తరం లో సందీప్ వంగ అలా తయారయ్యాడు అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అలాంటి క్రేజీ ఆలోచనలు ఉన్న డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా అంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. స్పిరిట్ చిత్రానికి అదే జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకి వచ్చినా అది వైరల్ గా మారిపోతుంది.
అయితే ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు చేయడం గోల్ గా పెట్టుకున్నాడు. అందుకే ఆయన ఏకకాలం లో రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ఉంటాడు. సాహూ, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలను ఆయన అలాగే చేసాడు. ఇలా పనిచేస్తున్న హీరో ఇండియా లో ఎక్కడా లేరు. భవిష్యత్తులో కూడా అయన ప్లానింగ్ ఇలాగే ఉంది. కానీ అందుకు సందీప్ వంగ మాత్రం ఒప్పుకోవడం లేదట. తన సినిమా చేసే సమయంలో వేరే సినిమా చేయకూడదని, అందుకు నేను అనుమతించనని, పూర్తి సమయం తన సినిమాకి మాత్రమే కేటాయించాలని, లేదంటే ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామని ప్రభాస్ తో అన్నాడట. దీనికి ప్రభాస్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ప్లాన్ ప్రకారం మార్చి నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వాలి, కానీ ముందుగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి డేట్స్ ఇవ్వడం తో ఆ సినిమా పూర్తి అయ్యాకనే ‘స్పిరిట్’ చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘రాజా సాబ్’. మారుతీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ సినిమా ఏప్రిల్ 10 న విడుదల అయ్యేది. కానీ ప్రభాస్ కాళ్లకు దెబ్బలు తగలడం, డాక్టర్లు కొంత కాలం విశ్రాంతి తీసుకోమనడంతో ఆయన విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి రాగానే ‘రాజా సాబ్’ షూటింగ్ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఆయన హను రాఘవపూడి సినిమాకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతో సమాంతరం గా ఆయన ‘కల్కి 2 ‘ షూటింగ్ చేయొచ్చు. 60 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యిందట. కాబట్టి ప్రభాస్ తక్కువ కాల్ షీట్స్ ఇచ్చినా ఈ సినిమా పూర్తి అవుతుంది. ఇవన్నీ పూర్తి అయ్యాకనే ఆయన ‘స్పిరిట్’ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయి.