Chiranjeevi Support Star Hero: ఇండియాలో ఎవరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి దక్కిన గౌరవం మరెవరికి దక్కలేదనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లాంటి నటుడు గత 50 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో చాలావరకు హెల్ప్ చేశాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ భారీ సినిమాలను చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను సైతం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి సోలోగా ఇండస్ట్రీలో పైకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అది కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికి స్టార్ హీరోగా అవతరించడంలో మాత్రం సూపర్ సక్సెస్ ని సాధించాడు…ఇక తనలాగే తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ సైతం స్టార్ హీరోగా మారడంలో చిరంజీవి కొంతవరకు హెల్ప్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో చిరంజీవి రవితేజ తమ్ముడి క్యారెక్టర్ లో నటించాడు. ఇక అప్పటి నుంచి రవితేజ మంచి నటుడు అంటూ కొంతమంది ప్రొడ్యూసర్లకు చిరంజీవి రవితేజను పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కు ముందున్నవన్నీ గడ్డు రోజులేనా?
మరి ఈ క్రమంలోనే ఆయనకి చిన్నచిన్న సినిమాల్లో అవకాశాలు రావడానికి సైతం చిరంజీవి హెల్ప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి అందించిన కొద్దిపాటి ప్రోత్సాహంతో రవితేజ ఇండస్ట్రీలో తన మనుగడును కొనసాగించినట్టుగా తెలుస్తోంది.
ఆ కృతజ్ఞతతోనే రవితేజ మరి చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. వీళ్లిద్దరు సోలోగా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న వాళ్లే కావడం విశేషం…
ఇక ప్రస్తుతం ఇద్దరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట వాళ్ళు చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…