Gudivada Amarnath Latest Comments: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) క్యాబినెట్ పై ఒక రకమైన ప్రచారం ఉండేది. ఇప్పటివరకు అటువంటి డమ్మీ క్యాబినెట్ చూడలేదని ప్రత్యర్ధులు ఆరోపిస్తుంటారు. అయితే ఇప్పుడు అది నిజమేనని అనిపిస్తుంది. ఇటీవల విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ డేటా సెంటర్ అనేది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు వల్ల వచ్చింది అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఇవి అంటూ ఒక పేపర్ కటింగ్ లు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గుడివాడ అమర్నాథ్ ఇలా కొత్త అవతారం ఎత్తారేంటి అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే దాదాపు రెండున్నర ఏళ్ల పాటు ఆయన ఐటి పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండేవారు. కానీ ఎన్నడూ విదేశాలకు వెళ్లి పారిశ్రామికవేత్తలతో మాట్లాడలేదు. దిగ్గజ ఐటీ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చేసరికి విశాఖలో నీరు ఖర్చయిపోతుందని.. జగన్ ఎప్పుడో ప్లాన్ చేశారని.. ఇప్పుడు గోతుల తవ్వితే ఎవరూ నమ్ముతారని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.
అడుగడుగునా విధ్వంసం..
ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎటువంటి విధ్వంసం రాష్ట్రంలో జరిగిందో ఎవరికీ తెలియనిది కాదు. ఆపై ఐటి పరిశ్రమలు అంటే కచ్చితంగా విద్యాధికులు చూస్తారు. వారికి వాస్తవాలు కూడా తెలుసు. కానీ ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మాటలను చూసి వారు సైతం అసహ్యించుకుంటున్నారు. పెట్టుబడులు తేకపోగా అసెంబ్లీలో అప్పడాలు, వడియాలు వంటి ఆహార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించారు అమర్నాథ్. ఈ రాష్ట్రానికి మేలైన ప్రాజెక్టుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు ఈ రాష్ట్రానికి మేలైన ప్రాజెక్టుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు అటువంటి వ్యక్తి కొత్తగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ క్రెడిట్ వచ్చేలా మాట్లాడుతున్నారు.
అప్పట్లో అడ్డగోలుగా మాట్లాడి..
ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు జరిగితాయని అంచనా ఉంది. గతంలో ఇటువంటి ప్రయత్నాలు జరగలేదు. దావోస్ పారిశ్రామిక పెట్టుబడులు సదస్సుకు ఎందుకు వెళ్ళలేదని ఇదే గుడివాడ అమర్నాథ్ ను ప్రశ్నిస్తే.. అక్కడ చలి ఉంటుందని సమాధానం చెప్పారు. చలిలో ఎలా వెళ్తామని ప్రశ్నించారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులు తమ హయాంలోనే తెచ్చామని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. కనీసం నిమిత్తమాత్రుడుగా అప్పట్లో ఉండేవారని.. ఇప్పుడు మాత్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించిన వారు ఉన్నారు. మొత్తానికి అయితే వైసిపి మాజీ మంత్రుల వైఫల్యం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు అనేక రకాలుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.