SSMB29 Story: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది గొప్ప దర్శకులు ఉన్నప్పటికి సత్తా ఉన్న దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఎప్పుడైతే ఆయన బాహుబలి సినిమాను చేసి తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కి పరిచయం చేశాడు. దాంతో ఆయన రేంజ్ మారిపోయింది. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా ప్రపంచంలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరి పక్కన తన పేరు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి…ఈ సినిమా లో విలన్ గా చేస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ లుక్ ను రివిల్ చేసిన రాజమౌళి కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కథ కూడా లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ ఏంటంటే.. ‘కుంభ’ అనే ఒక క్రూరమైన వ్యక్తి ఫిజికల్ గా హ్యాండీక్యాప్డ్ గా ఉంటాడు. ఇతనికి ప్రపంచాన్ని చుట్టేయాలని ఒక కోరిక ఉంటుంది.
అప్పటికే ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్న హీరో ఈ ప్రపంచానికి పరిచయం చేయమని చెప్పగా అతను మాత్రం ఒప్పుకోడు. దాంతో వాళ్ల సిస్టర్ అయిన ప్రియాంక చోప్రా మహేష్ బాబు కి ప్రేమ పేరు చెప్పి దగ్గరవుతుంది. దాంతో వాళ్ళ బ్రదర్ ని ప్రపంచం మొత్తం తిప్పడానికి మహేష్ బాబు ఒప్పుకుంటాడు.
ఇక ఆ తర్వాత కుంభ వచ్చింది ప్రపంచాన్ని తిరగడానికి కాదు. తనకు కావాల్సిన కొన్ని ఔషధాలను సేకరించుకోవడానికి.. దాంతో ఆయన తన అంగవైకల్యాన్ని పోగొట్టుకొని నార్మల్ వ్యక్తిలా మారే ఒక ఔషధ గుణాలు ఉన్న కొన్ని మూలికల కోసం వెతుకుతూ ఉంటాడు. తను మంచిగా మారితే ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న హీరో తనను ఎలా అడ్డుకున్నాడు అనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది… ఇక మొత్తానికైతే ఈ సినిమా కథ ‘ఇండియానా జోన్స్’ ఇన్స్పిరేషన్తో తెరకెక్కుతోంది.
ఇక ఇప్పటికే ఇండియానా జోన్స్ ఇన్స్పిరేషన్ తో వచ్చిన అంజి సినిమా కథ కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంజి మూవీ స్టోరీ మహేష్ బాబు మూవీ కథ ఒక్కటే అంటూ చాలామంది సినీ ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండటం విశేషం… ఇదే ఈ మూవీ ఒరిజినల్ కథనా లేదంటే ఇంకొంచెం వేరే కథను జోడించి సినిమాని చెప్పాలనుకుంటున్నారా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…