Ongole : ఒంగోలులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిరిజన యువకుడ్ని దారుణంగా కొట్టి .. నోట్లో మూత్రం పోసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నెల రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. కేవలం దాడి, ఎస్సీ,ఎస్టీ కేసుగానమోదుచేసి చేతులు దులుపుకున్నారు. అయితే నాటి దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. దీంతో నిందితుల కోసం ఒంగోలు పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
ఒంగోలుకు చెందిన గిరిజన యువకుడు మోటా నవీన్, మన్నె రామాంజనేయుడు (అంజీ) దొంగతనాలకు పాల్పడేవారు. చిన్నప్పటి నుంచే ఇద్దరూ జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇద్దరిపై 50 కు పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. నవీన్ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. అంజీ మాత్రం పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. అయితే ఇద్దరి మధ్య ఇటీవల విభేదాలు చోటుచేసుకున్నాయి. ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి.
నెలరోజుల కిందట మద్యం తాగుదామని నవీన్ ను అంజీ పిలిచాడు. ఒంగోలు కిమ్స్ వైద్యశాల వెనుక వైపు పిలిచాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అప్పటికే తొమ్మిది మందిని అంజీ సెటప్ చేశాడు. నవీన్ తో పూటుగా మద్యం తాగించాడు. పాత వివాదాన్ని తిరగదోడాడు. మాటా మాటా పెరగడంతో మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. బాధితుడు కాళ్లావేల్లా పడినా కనికరించలేదు. అంతటితో ఆగకుండా నోట్లో మూత్రం పోసి మరోసారి దాడిచేశారు. మర్మంగాన్ని నోట్లో చొచ్చే ప్రయత్నం చేశారు. వీటిని సెల్ ఫోన్లో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందారు. అయితే ఆ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటువంటి అమానుష చర్యలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేస్తున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు బుల్టోజర్ సంస్కృతి తెచ్చింది. గిరిజనులపై అమానుష దాడులు చేస్తున్నవారి ఇళ్ళను, ఆస్తులను ధ్వంసం చేస్తోంది. మధ్యప్రదేశ్ లో ఇటీవల ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటనపై స్పందించి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిందితుడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేయించారు. అయితే ఇప్పుడు ఏపీలో అటువంటి ఘటనే వెలుగుచూడడంతో సీఎం జగన్ ఏం చేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. బాధితుడికి నేర చరిత ఉందనో.. లేకుంటే నిందితులు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారానో.. లేకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనో చెప్పి తప్పించుకుంటారో చూడాలి మరి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Group of men attacked tribe youth and urinate in his mouth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com