Pooja Hegde: హీరోయిన్ పూజ హెగ్డే కెరీర్ పూర్తిగా నెమ్మదించింది. ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పూజ హెగ్డేను మెయిన్ హీరోయిన్ గా తీసుకుని తర్వాత సెకండ్ లీడ్ చేశారట. సెకండ్ లీడ్ కోసం తీసుకున్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ చేశారట. ఈ కారణంగా పూజా హెగ్డే తప్పుకున్నారని సమాచారం. ఏడాది కాలంలో పూజా హెగ్డేకి రెండు మూడు బడా ప్రాజెక్ట్స్ చేజారాయి.
పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబోలో జనగణమన టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ కూడా జరుపుకున్న ఈ మూవీ నిర్మాతలు తప్పుకోవడంతో ఆగిపోయింది. అనంతరం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పూజా చేయాల్సి ఉండగా శ్రీలీల ఆఫర్ కొట్టేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా డిలే అయినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా గుంటూరు కారం మూవీ నుండి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది.
దానికి తోడు వరుస ఫెయిల్యూర్స్. రాధే శ్యామ్ నుండి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వరకు వరుసగా ఐదు ప్లాప్స్ పడ్డాయి. దీంతో ఆఫర్స్ అడుగంటాయి. ఈ క్రమంలో పూజా హెగ్డే మానసిక వేదనకు గురైయ్యారట. ఆమె ఆత్మహత్యాయత్నం చేశారనే వార్త సంచలనమైంది. ఓవర్ సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ఈ మేరకు ట్వీట్ చేశారు. పూజా హెగ్డే సూసైడ్ చేసుకోబోయారు. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు గమనించి కాపాడారు. గత రెండు వారాలుగా ఆమె తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని ట్వీట్ చేశాడు.
ఉమర్ సంధు ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే ఉమర్ సంధు ట్వీట్లో ఎలాంటి నిజం లేదని పలువురు భావిస్తున్నారు. సెన్సేషన్ కోసం ఉమర్ సంధు సెలబ్రిటీల మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం పరిపాటి. గతంలో కూడా హీరో, హీరోయిన్స్ కి లింకులు పెడుతూ ట్వీట్స్ వేశాడు. హీరో ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ అని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ పై కూడా అభ్యంతర ట్వీట్స్ వేశాడు.
Breaking news ️: #PoojaHegde tried to do suicide today afternoon. Thankgod, Her family members saved her. Details are coming !! As per her brother, She was in severe depression from last 2 weeks. pic.twitter.com/4E5nI5HRWQ
— Umair Sandhu (@UmairSandu) July 15, 2023