Grater Visakha : విశాఖ రాజకీయాలు( Visakhapatnam politics) ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం చెల్లాచెదురు అయ్యింది. పెద్ద ఎత్తున కూటమి పార్టీల్లో వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు చేరుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు వస్తున్నారు. తాజాగా 9మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు సిద్ధపడ్డారు. వారంతా విజయవాడ పయనం అయ్యారు.
Also Read : కూటమి ఖాతాలోకి గ్రేటర్ విశాఖ.. అవిశ్వాస తీర్మానం రెడీ!
* అప్పట్లో వైయస్సార్సీపీ సొంతం
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్( grater Visakha Municipal Corporation ) ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 98 మంది సభ్యులుగాను 58 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. కూటమి పార్టీలు 32 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. అయితే ఎన్నికలకు ముందు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా చాలామంది చేరారు. తాజాగా మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు సిద్ధపడిపోయారు. దీంతో విశాఖ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది. రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నింటా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతోంది. ఇప్పుడు అవిశ్వాసాల తీర్మాన సమయం ఆసన్నం కావడంతో.. ఒక్కొక్కటి కూటమి చేతిలోకి రానుంది.
* గణనీయంగా పెరిగిన కూటమి బలం
ప్రస్తుతం విశాఖ నగరంలో కూటమి( TDP Alliance) బలం భారీగా పెరిగింది. తెలుగుదేశం పార్టీకి 29 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఎన్నికల అనంతరం 12 మంది టిడిపిలో చేరారు. తాజాగా మరో తొమ్మిది మంది పార్టీ మారనున్నారు. జనసేనకు ముగ్గురు ఉండగా.. ఎన్నికల అనంతరం ఆ పార్టీలో ఏడుగురు చేరారు. మరోవైపు బిజెపికి ఇద్దరు సభ్యుల బలం ఉంది. దీంతో విశాఖ నగరంలో కూటమి బలం 62 కు చేరింది. దీంతో ఇక్కడ మేయర్ పదవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేజారడం ఖాయమని తేలిపోయింది.
Also Read : వైఎస్సార్ పేరు తొలగింపు..కూటమి ప్రభుత్వం సంచలనం