AP Assembly Budget Session 2025:ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( AP assembly budget sessions ) ప్రారంభమయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది శాసనసభలో. అందులో భాగంగా ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాదాపు మూడు వారాలపాటు ఈ సభలు కొనసాగనున్నాయి. శాసనసభను ఉద్దేశించి గవర్నర్ నజీర్ అహ్మద్ మాట్లాడుతున్నారు. అంతకుముందు శాసనసభ సమావేశాలకు హాజరైన గవర్నర్ కు సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. ఈ సమావేశాలకు విపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్న సంగతి తెలిసిందే. దీంతో అందరి దృష్టి ఆయనపై పడింది.
* నరేంద్ర చంద్రబాబు అంటూ..
మరోవైపు గవర్నర్ నజీర్ అహ్మద్( Governor Nazeer Ahmed ) ప్రభుత్వ ప్రగతి గురించి వివరించారు. పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే తన ప్రసంగంలో తడబడ్డారు గవర్నర్. ఏపీ సీఎం నారా చంద్రబాబు పేరు మరిచిపోయారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పేరు ప్రస్తావిస్తూ అందులో చంద్రబాబు పేరును కలిపారు. గవర్నర్ చంద్రబాబు పేరు మర్చిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* గత ప్రభుత్వ హయాంలో నియామకం
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర గవర్నర్ గా నజీర్ అహ్మద్ నియమితులయ్యారు. ఈయన పూర్వాశ్రమంలో రిటైర్డ్ అధికారి. అప్పట్లో ఏపీ విషయంలో ప్రత్యేక దృష్టితో ఉన్న బిజెపి ఈయనను నియమించింది. గత కొద్ది రోజులుగా గవర్నర్ పెద్దగా కనిపించలేదు. వల్లభనేని వంశీ అరెస్టుతోపాటు జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో సమావేశం అయ్యారు.
* సభ వాయిదా
గవర్నర్ ప్రసంగం( governors speech ) అనంతరం ఈరోజు సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన కేవలం గవర్నర్ ప్రసంగం వరకే పరిమితం అవుతారని.. రేపటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కారు అని పిలుస్తోంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో.. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా సభకు వస్తారని తెలుస్తోంది.
ఏపీ సీఎం పేరు మర్చిపోయిన గవర్నర్
ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ పిలిచిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ pic.twitter.com/7L791XTSzH
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025