Google shocks YCP: విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ( Google data centre) వచ్చింది. దేశంలో అగ్ర రాష్ట్రాలకు కాదని ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు వచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మైలేజీ పెరిగింది. దేశవ్యాప్తంగా అందరి చూపు విశాఖ వైపు పడింది. సోషల్ మీడియాలో సైతం సానుకూలత కనిపిస్తోంది. ప్రజల్లో సైతం సంతృప్తి పెరుగుతోంది. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. అందుకే గూగుల్ డేటా సెంటర్ విషయంలో వ్యతిరేక ప్రచారాన్ని అందుకుంది. ఉద్యోగాలు తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టు మాట్లాడుతోంది. అన్ని ఉద్యోగాలు వస్తాయనుకుంటే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనుకుంటే గూగుల్ సీఈఓ తో మాట్లాడాలని సవాల్ చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎంతలా అంటే గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తితో ఈ మాటలు ఆడిస్తుండడం ఒకరకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. అప్పడాలు, పచ్చళ్ళ పరిశ్రమలతో ఒప్పందాలు అంటూ పిచ్చి పిచ్చి మాటలు ఆడేవారు గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు అదే నేత లాజిక్కులు మాట్లాడుతుండడం కొంచెం ఎబెట్టుగా ఉంది.
గూగుల్ సీఈఓ వివరణ..
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి షాకింగ్ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విశాఖ గూగుల్ సెంటర్ ఏర్పాటుపై సంచలన అంశాలను వెల్లడించారు. దక్షిణ భారత దేశంలో విశాఖపట్నం సుందర నగరంగా అభివర్ణించారు. అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించినట్లు చెప్పారు. ఒక్క డేటా సెంటర్ ఏర్పాటుతో అనుబంధ పరిశ్రమలు వస్తాయని తేల్చి చెప్పారు. తద్వారా ఉద్యోగాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇది ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ ఇచ్చే అంశమే. ఏకంగా గూగుల్ సీఈవో చెప్పేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదనకు బ్రేక్ పడినట్టే.
ఆ ప్రచారానికి చెక్..
అయితే ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారంలో ముందుంటుంది. ప్రపంచ దిగ్గజ గూగుల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడంపై విశ్లేషకులు, ఐటీ నిపుణులు స్వాగతిస్తున్నారు. గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు. అందుకే దారుణంగా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. అలాగని నేరుగా ప్రకటన చేసేందుకు సాహసించడం లేదు. అయితే ఇప్పుడు ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్( Google CEO Sundar Pichai) ఈ ప్రకటన చేసేసరికి ఆ పార్టీకి షాక్ తగిలినట్టే.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాటల్లో వైజాగ్✨
విశాఖపట్నం గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. డ్రీమ్‌ఫోర్స్ ఈవెంట్లో మాట్లాడుతూ, వైజాగ్‌ను “బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్”గా వర్ణించారు. గూగుల్ 15 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ & ఏఐ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు… pic.twitter.com/VA4QzL4YwM— Tupaki (@tupaki_official) October 18, 2025