Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి హాల్ చల్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేసు విచారణకు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హిరమండలం పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. కొత్తూరు సర్కిల్ స్టేషన్ పరిధిలో విచారణ జరిగింది. ఈ క్రమంలో రోజంతా హై డ్రామా చోటు చేసుకుంది. అయితే ఈ కేసు వెనుక మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ఉన్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. కానీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే జనసేన నేతలు ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు. మరి అందులో మంత్రికి సంబంధం అంటగట్టారు దువ్వాడ శ్రీనివాస్. మొన్నటివరకు వైసీపీకి చెందిన ధర్మాన సోదరులపై పడ్డారు. ఇప్పుడు కింజరాపు బాబాయ్ అబ్బాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. దీని వెనుక పక్క రాజకీయ వ్యూహం ఉందన్నది విశ్లేషకుల మాట. పైగా తన సామాజిక వర్గం పేరు చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ జంక్షన్ లో ఉన్నారు. కానీ తన అధినేత జగన్మోహన్ రెడ్డి అంటూ చెబుతున్నారు. మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ఈ ఎత్తుగడ అన్నది విశ్లేషకుల మాట.
* ప్రతి ఎన్నికల్లో ఓటమి..
2001 నుంచి యువజన కాంగ్రెస్ లో పనిచేస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యారు ప్రతి ఎన్నికల్లోను పోటీ చేయడం ఓడిపోవడం పరిపాటిగా మారింది. 2019లో సైతం జగన్ ప్రభంజనం రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చింది. టెక్కలిలో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో చట్టసభల్లో అడుగు పెట్టాలన్న దువ్వాడ శ్రీనివాస్ ఆశ తీరలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన సరే పార్టీలో కొనసాగింపు ఇచ్చారు. కానీ వ్యక్తిగత వివాదాలతో పార్టీకి ఇబ్బంది కలిగించడంతో సస్పెన్షన్ వేటు వేశారు.
* ఇంకా ఏడాది కాలమే..
మరో ఏడాది కాలంలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవి పూర్తవుతుంది. ఇంతలోనే వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలన్నది దువ్వాడ శ్రీనివాస్ ఆలోచన. అయితే దువ్వాడ పార్టీలోకి వస్తే ధర్మాన సోదరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆపై పార్టీలో సీనియర్లు సైతం ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. శాశ్విత వేటు వేద్దాం అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి తో ఆయన ఎమ్మెల్సీ పదవి ముగియనుంది. తెలుగుదేశం పార్టీలోకి ఎలాగూ ఎంట్రీ లేదు. జనసేనలో చేరుతామంటే అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. ఎమ్మెల్సీ పదవి పూర్తయ్యేలోగా వైసీపీలోకి ఛాన్స్ వస్తే పర్వాలేదు. లేకుంటే తన పరిస్థితి ఇబ్బంది శ్రీనివాస్ కు తెలుసు. అందుకే ఇప్పుడు టిడిపి మంత్రి కింజరాపు అచ్చేనాయుడు ను టార్గెట్ చేసుకున్నారు. అలా అయినా జగన్ తనను తిరిగి పిలుస్తారని భావిస్తున్నారు. మరోవైపు కులం కార్డు ప్రయోగిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి పిలుస్తారా లేదా అన్నది అనుమానమే.
