AP Government: ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వం అని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ప్రారంభించింది. తాజాగా బీసీ విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా బీసీ విద్యార్థులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధి చేయాలని అనుకునేవారు.. సొంతంగా ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలని భావించేవారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. దీంతో వెంటనే అర్హులైన యువత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పథకం పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీలోని బీసీ విద్యార్థులకు సంక్రాంతి కానుకగా ప్రభుత్వం కొత్త స్కీం ను అందించింది. రాష్ట్రంలోని బీసీ విద్యార్థులు, నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో 50 శాతాన్ని సబ్సిడీని కూడా అందించనున్నారు. రాష్ట్రంలోని బీసీలు, ఈ డబ్ల్యూఎస్ విద్యార్థులు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ముందుగా వారి రేషన్ కార్డు, ఆదాయ ధ్రువ పత్రాలతో పాటు అవసరమైన వాటితో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను అధికారులను పరిశీలించిన తరువాత అర్హులను ఎంపిక చేస్తారు.
అర్హులుగా ఎంపికైన బీసీ యువకులకు మొదటి శ్లాబ్ కింద రూ.2 లక్షల వరకు రుణం అందజేస్తారు. ఇందులో 75 వేల వరకు రాయితీ ఉంటుంది. మిగతా మొత్తాన్ని రుణం కింద అందిస్తారు. అలాగే రెండో శ్లాబ్ లో రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అందిస్తారు. ఇందులో రూ.1.25 లక్షల వరకు మాఫీ ఉంటుంది. మూడో శ్లాబ్ కింద రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణం అందిస్తారు. ఇందులో రూ.2 లక్షల వరకు రాయితీ ఇస్తారు. అయితే భీ ఫార్మసీ చేసి విద్యార్థులు జనరిక్ మందుల షాప్ లు ఏర్పాటు చేస్తే వారికి రూ.8 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఇందులో 50 శాతం రాయితీ ఉంటుంది. అంటే రూ. 4 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా రూ.4 లక్సలు రుణం కింద అందిస్తారు.
బీసీలు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఈ పథకం వర్తించనుంది. వీరు ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ కోటా కింద చేరారు. ఆ ధ్రువపత్రం ఆధారంగా వీరు కూడా సంబంధిత ఉపాధిని ఏర్పాటు చేసుకొని రుణం పొందవచ్చు. ఈ పథకం ఫలాలు పొందాలంటే 21 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వరకు ఉండాలి. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ రుణాల ద్వారా వెనుకబడిన యువతకు ఉపయోగపడనుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా సొంతంగా వ్యాపారం చేయాలని అనుకునేవారికి ఇదే మంచి అవకాశం అని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎంతో కాలంగా ఉపాధి కోసం చూస్తున్న వారికి తమ కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Good news for the youth of the state government 8 lakh loan 50 percent discount
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com