Homeఆంధ్రప్రదేశ్‌AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త స్కీమ్!

AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త స్కీమ్!

AP Dwakra Women: ఏపీలో( Andhra Pradesh) డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టింది టిడిపి సర్కార్. దేశంలోని అన్ని రాష్ట్రాలకు డ్వాక్రా స్కీమ్ నమూనాగా నిలిచింది. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి స్వయం సహాయక సంఘాల విషయంలో సంచల నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వం పట్టణ మహిళల కోసం డిజి లక్ష్మీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 250 రకాల సేవలు పట్టణ ప్రజలకు అందరూ ఉన్నాయి. డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ సేవలను అందించనున్నారు. ఈ పథకంలో డ్వాక్రా మహిళలకు శిక్షణకు గాను రూ.24 కోట్లు కేటాయించారు. దీంతో మహిళలకు మరింత ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

Also Read: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కు ముందున్నవన్నీ గడ్డు రోజులేనా?

* 250 రకాల సేవలు
పట్టణ ప్రజలకు 250 రకాల సేవలు అందించేందుకు గాను.. డిజి లక్ష్మీ( DG Lakshmi ) పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 9,034 కామన్ సర్వీసెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. డ్వాక్రా మహిళలు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు మెప్మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సి.ఎస్.పి కేంద్రాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాల తరహాలోని ఈ సెంటర్లలో వివిధ రకాల సేవలను ప్రజలు పొందవచ్చు. ఈ సెంటర్ ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు ఇప్పించడం ప్రధాన లక్ష్యం.

* అర్హతలివే
ఈ సెంటర్ల ఏర్పాటుకు గాను మహిళలకు కొన్ని రకాల అర్హతలు ఉండాలి. స్వయం సహాయక సంఘంలో కనీసం మూడేళ్ల క్రితం చేరి ఉండాలి. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వివాహం అయి ఉండాలి. డిగ్రీ చదివి ఉన్నవారు అర్హులు. స్మార్ట్ ఫోన్( smartphone) కలిగి ఉండాలి. ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటు చేయడానికి రూ. 2.50 లక్షల వరకు రుణం ఇస్తారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

* ప్రత్యేక శిక్షణ
ఈ పథకంలో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకుగాను ప్రభుత్వం రూ.23.84 కోట్లు ఖర్చు చేయనుంది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వీరితో పాటుగా స్వయం సహాయ సంఘాల సభ్యులకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version