AP Asha Workers: కూటమి ప్రభుత్వం ఆశ వర్కర్లపై( Asha workers) కరుణించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా రిటైర్మెంట్ గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆశా వర్కర్ల మొదటి రెండు ప్రసవాలకు ఇకపై 108 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. గ్రాడ్యుటీ చెల్లించాలని కూడా నిర్ణయించారు. ఎందుకు సంబంధించి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా ఈ సమస్యల కోసం ఆశా కార్యకర్తలు పోరాడుతూనే ఉన్నారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం స్పందించింది. వారికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.
Also Read: మాజీ డిజిపికి అరుదైన చాన్స్.. ఎంతో నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన చంద్రబాబు!*
* తక్కువ వేతనంతో.. రాష్ట్రవ్యాప్తంగా( state wide ) 42,750 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారికి నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తున్నారు. సర్వీస్ ముగిసిన తరువాత గ్రాడ్యుటీ కింద రూ. 1.5 లక్షలు అందుతుందని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖలో ఆశా కార్యకర్తలు మెరుగైన సేవలు అందిస్తూ వచ్చారు. ప్రసవాలతో పాటు గర్భిణీలకు వైద్య సేవలు, బాలింతల ఆరోగ్యపరమైన సమస్యలపై ఆశా కార్యకర్తలు ప్రత్యేకంగా దృష్టి పెడుతూ వచ్చారు. ప్రభుత్వ ఏఎన్ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ వీరి పనికి తగ్గట్టు వేతనం అందడం లేదన్న విమర్శ ఉండేది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
* హమాలీల చార్జీల పెంపు..
అలాగే రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థలో( civil supply department) పనిచేసే హమాలీలకు లోడింగ్, అన్లోడింగ్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. గతంలో క్వింటాకు 25 రూపాయలు ఇచ్చేవారు. మరో మూడు రూపాయలు పెంచి 28 రూపాయలు అందించనున్నారు. పెంచిన చార్జీలతో ప్రభుత్వం పై ఏడాదికి రూ.9.26 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే ఐదు వేల మంది హమాలీలకు స్వీట్ ప్యాకెట్ ఇవ్వడానికి ఏడాదికి 1500 రూపాయల చొప్పున కూడా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే గోదాముల్లో స్వీపర్ చార్జీలను 41.8% పెంచారు. దీనివల్ల ప్రభుత్వంపై 46 లక్షల రూపాయల అదనపు భారం పడనుంది.