Amalapuram: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియా( social media) సెన్సేషన్ సృష్టిస్తోంది. యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్బుక్, ఎక్స్ లో యూత్ క్రియేటివిటీ గా కొత్త కొత్త వీడియోలు వైరల్ చేస్తుంటారు కొంతమంది. అయితే ఇదో వ్యాపారంలా మారిపోయింది. కొంతమంది అయితే ఫాలోవర్స్, వ్యూస్ కోసం పడే తపన అంతా ఇంతా కాదు. చిత్ర విచిత్రమైన ఫీట్లు చేస్తుంటారు. వాటిని వైరల్ చేసే పనిలో పడతారు. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన పని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. తనకోసం జనాలను ఎర్రిపప్పలు చేశాడు. మనోడు చేసిన పనికి ఏకంగా జనాలు వచ్చి గ్రౌండ్నే తవ్వేశారు.
Also Read: మాజీ డిజిపికి అరుదైన చాన్స్.. ఎంతో నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన చంద్రబాబు!*
* బహుమతుల పేరుతో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో( Amalapuram) ఓ విచిత్ర ఘటన జరిగింది. అక్కడ బాలయోగి స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది. మందపాటి ఆదిత్య అనే యువకుడు యూట్యూబ్ క్రియేటర్. అతడు తన ఇన్ స్టా గ్రామ్ లో గోల్డ్ హంట్ పేరుతో ఒక ప్రకటన చేశాడు. ఫస్ట్ ప్రైజ్ కింద గోల్డ్, రెండో ప్రైస్ కింద వెండి ఉంగరం, మూడో ప్రైజ్ కింద ఇయర్ బర్డ్స్ ఇస్తానని చెప్పాడు. శుక్రవారం రోజంతా తన ను ఇన్స్టాలో ఫాలో అయిన వారికి గోల్డ్ హంట్ వీడియోను రీల్ గా పెట్టాడు. ఈ ప్రకటన తర్వాత జనాలు అక్కడకు పరుగులు తీశారు. అయితే ఆ బంగారం భూమిలో పాతి పెట్టానని చెప్పడంతో.. ఓ 200 మంది గ్రౌండ్లో గుంతలు తవ్వడం ప్రారంభించారు. కొంతమందికి అవి దొరికాయి కూడా.
* జిల్లా క్రీడా శాఖ అధికారి ఆగ్రహం
అయితే గ్రౌండ్ లో( ground) గోతులు తవ్వుతున్నారు అన్న విషయం తెలుసుకున్న జిల్లా స్పోర్ట్స్ అధికారి అక్కడికి వెళ్లారు. గోతుల తవ్వుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. గతంలో కూడా కొందరు యూట్యూబర్లు మనీ హంట్ పేరుతో ఇలానే చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వీటిపై గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.