Good news for APSRTC: ఏపీలో( Andhra Pradesh) ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. గత మూడు నెలలుగా ఈ పథకం దిగ్విజయంగా అమలవుతోంది. ఇటువంటి సమయంలో ఏపీ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి పెద్ద ఎత్తున నిధులు జమ చేసింది. మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు చెల్లించింది. ఉచిత ప్రయాణ పథకంలో రాయితీకి గాను ఈ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఏపీఎస్ఆర్టీసీకి నష్టం కలుగుతుందని యూనియన్ల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆర్టీసీని నష్టంలో నెట్టేసే నిర్ణయం అని భావించారు. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆ హామీ మేరకు..
అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ప్రయాణ పథకం పై అధ్యయనం చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నిర్మించారు. ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పరిస్థితిని అధ్యయనం చేసింది మంత్రుల బృందం. స్వయంగా పరిశీలించి విధి విధానాలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 15న స్త్రీ శక్తి పేరుతో పథకం ప్రారంభం అయింది. గత మూడు నెలలుగా విజయవంతంగా అమలవుతోంది.
ఐదు రకాల బస్సుల్లో..
ప్రస్తుతం పల్లె వెలుగు( Pallavi logo ), అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. అయితే గత మూడు నెలలుగా ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఉచిత ప్రయాణ పథకం పుణ్యమా అని ఆర్టీసీలో మహిళల ప్రయాణం అధికమైంది. గత ఏడాది సెప్టెంబర్ గణాంకాలతో పోల్చుకుంటే.. ఈ ఏడాది పది లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు ఉచిత ప్రయాణ పథకంతో ఆర్టీసీపై భారం పడుతుందని యూనియన్ నేతలు ఆందోళన చెందారు. దీనిపైనే ప్రభుత్వానికి కొన్ని రకాల విన్నపాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆర్టీసీ ఖాతాల్లో జమ చేసింది. దీనిపై యూనియన్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.