NDA double century: బిహార్ రాజకీయ వేదికపై ఎన్డీఏ మరోసారి పెను ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కౌంటింగ్ ధోరణులు రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పును సూచిస్తున్నాయి. మొదటి రౌండ్ల నుంచే బీజేపీ–జేడీయూ కూటమి ఓటర్ల నమ్మకాన్ని దక్కించుకుని స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.
200 స్థానాల్లో ఆధిక్యం..
మొత్తం 243 స్థానాల్లో సగం వరకు లెక్కింపు పూర్తవుతున్నప్పటికీ, ఎన్డీఏ దాదాపు 200 స్థానాల్లో ఆధిక్యంలో నిలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటుకు పునాదులు వేసింది. బీజేపీ 88, జేడీయూ 77, ఎల్‌జేపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇతర మిత్రపక్షాలు కూడా కొన్నిచోట్ల బలంగా నిలుస్తున్నాయి. ఇక ఆర్జేడీ 34, కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకు పరిమితమైంది.
ప్రతిపక్ష కూటమికి భారీ ఎదురుదెబ్బ
మహాగట్‌బంధన్‌కు ఈ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. ఆర్జేడీ 34 స్థానాలకే పరిమితమైంది. కూటమి బలహీనతను ఇది బయటపెట్టింది. జన్‌సురాజ్, ఆర్‌ఎల్‌సీపీ వంటి చిన్నపార్టీలు ఈ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపడంలో విఫలమయ్యాయి.
నితీశ్‌కు మరో అవకాశమా?
జేడీయూ లీడింగ్ సంఖ్య గట్టి పాయింట్‌గా ఉన్నా, బీజేపీ ఆధిక్యం అధికంగా ఉండడం అధికార సమీకరణాలు ఎలా ఉండబోతాయనే ప్రశ్నను తెరమీదకు తెచ్చింది. అయినప్పటికీ, ఎన్డీఏలో అంతర్గత సమన్వయం కొనసాగితే, నితీశ్ కుమార్ మళ్లీ సీఎం కుర్చీపై కూర్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
బిహార్ ఓటర్లు ఈసారి స్థిరత్వం వైపు మొగ్గుచూపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి, జాతీయ అంశాలు, కేంద్రమద్దతు వంటి అంశాలు ఎన్డీఏ విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. మహాగట్‌బంధన్ లోపాలు, సంఘటిత ప్రచార లోపం ప్రతిఫలంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.