Chandrababu Heartfelt Condolence: టిడిపిలో( Telugu Desam Party ) ఆయన ఓ సామాన్య కార్యకర్త. గుండెపోటుకు గురై మరణించారు. కానీ ఏకంగా అధినేత చంద్రబాబు స్పందించారు. ఒక పోరాట యోధుడని కొనియాడారు. ఒక సామాన్య కార్యకర్త మృతి చెందితే అధినేత స్పందించడం ఏంటనేది మీ ప్రశ్న కదా? అయితే ఆ సామాన్య కార్యకర్త ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఒక ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని ఎదిరించి ఆ కార్యకర్త పోరాడిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మాచర్లలో విధ్వంసాలు చెలరేగిన సంగతి తెలిసిందే. నేరుగా అప్పటి ఎమ్మెల్యే పోలింగ్ బూత్ కు వచ్చి ఈవీఎంలను ద్వంసం చేసే క్రమంలో.. ధైర్యంగా అడ్డుకున్నారు టిడిపి ఏజెంట్ నంబూరి శేషగిరిరావు. ఆయన ఈరోజు మరణించడంతో టిడిపి శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన స్ఫూర్తిని గుర్తు చేస్తున్నాయి.
ఎమ్మెల్యే అనుచరులను ఎదుర్కొని..
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాచర్ల( macharla) నియోజకవర్గం లో పోలింగ్ బూత్ లోకి ప్రవేశించారు అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంలను వంశం చేయడంతో పాటు సామగ్రిని పగలగొట్టారు. ఆ సమయంలో టిడిపి ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి మనుషులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా నిలిచింది. నంబూరి శేషగిరిరావు పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. అయితే ఒకవైపు తీవ్ర గాయాలతో రక్తం కారుతున్నా.. వైసీపీ నేతలకు ఎదురుద్దీ నిలిచారు శేషగిరిరావు. అయితే ఆస్పత్రి పాలైన శేషగిరిరావు కు చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: మద్యం కుంభకోణంలో వైయస్ భారతి పేరు?
పార్టీ శ్రేణుల సంతాపం..
అనారోగ్యానికి గురైన శేషగిరిరావు( Sasha Giri Rao ) గుండెపోటుతో ఈరోజు మరణించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టిడిపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంతాపం తెలిపారు. శేషగిరి రావు మరణం తమను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలిపారు. శేషగిరిరావు మరణ వార్త తెలుసుకున్న పలువురు కూటమి నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక పోరాట యోధుడిని కోల్పోయిందన్నారు. శేషగిరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.