https://oktelugu.com/

IAS officers : అమరావతిలో ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఎంట్రీ

ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు పనిచేయాల్సిందేనని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నామని.. ఏపీకి వెళ్లేందుకు ఆ నలుగురు సుముఖత వ్యక్తం చేయలేదు. అంతటితో ఆగకుండా న్యాయపోరాటం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు వాళ్లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 17, 2024 / 06:10 PM IST

    IAS officers

    Follow us on

    IAS officers : ఏపీలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏపీకి తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులు వచ్చారు. గురువారం అమరావతిలో రిపోర్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నుతెలంగాణకు చెందిన ఆ నలుగురు ఐఏఎస్ అధికారులు కలిశారు.ఏపీలో పని చేసేందుకు తమ సమ్మతిని తెలియజేశారు.ఇప్పటికే ఏపీకి చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణలో రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రోస్ తదితర అధికారులను ఏపీ కేడర్ కు కేటాయించారు. అయితే వారంతా డిప్యూటేషన్ పై తెలంగాణలో పనిచేస్తున్నారు. అదే ప్రాతిపదికన ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఏపీలో కొనసాగుతున్నారు. అయితే ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు పనిచేయాల్సిందేనని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నామని.. ఏపీకి వెళ్లేందుకు ఆ నలుగురు సుముఖత వ్యక్తం చేయలేదు. అంతటితో ఆగకుండా న్యాయపోరాటం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు వాళ్లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది.

    * రాష్ట్ర విభజనలో కేటాయింపు
    ఏపీ తెలంగాణకు చెందిన మొత్తం 11మంది ఐపీఎస్,ఐఏఎస్ అధికారులకు గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా కేటాయింపులు చేశారు. కానీ వారు డిప్యూటేషన్ పై వారునచ్చిన రాష్ట్రాల్లోనే ఉండిపోయారు.దీంతో ఏపీలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ లు తెలంగాణకు, అలాగే తెలంగాణలో ఉన్న నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఐపీఎస్ అధికారుల పరిస్థితి అలానే ఉంది. అయితే ఆ నలుగురు భీష్మించుకున్నారు. అక్కడే తెలంగాణలో కొనసాగాలని భావించారు. కానీ వీలుపడలేదు. దీంతో అమరావతికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

    * హైకోర్టును ఆశ్రయించిన వైనం
    అయితే కేంద్రం ఆదేశాలను వీరు పట్టించుకోలేదు.ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు.తాము పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.కానీ కేంద్రం ఆదేశాలను పాటించాల్సిందేనని కోర్టు ఆదేశించడంతో మీరు ఏపీకి రాక తప్పలేదు.కేంద్రం చెప్పినట్లుగానే రిపోర్టింగ్ చేయక మానలేదు.