Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ టీంకి బైబై

Jagan: జగన్ టీంకి బైబై

Jagan: సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు..అధికారులను తప్పకుండా మార్చుతారు. ఇది సాధారణ అంశం కూడా. అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్ అస్మదీయ అధికారులుగా ఉన్నవారిని చంద్రబాబు మార్చారు.గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్కు పాలనాపరంగానే కాకుండా.. రాజకీయ అంశాల్లో సైతం అధికారులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారిని ఇప్పుడు చంద్రబాబు వెంటాడడం ప్రారంభించారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జగన్ రెడ్డి సర్వీసులో మునిగితేలిన నలుగురు కీలక అధికారులను జిఏడీకి అటాచ్ చేశారు. ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.వీరిలో ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, మురళీధర్ రెడ్డి ఉన్నారు. శ్రీ లక్ష్మీ తన పోస్టింగ్ కాపాడుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు సరి కదా.. ఆమె ఇచ్చిన పుష్పగుచ్చాలు కూడా అందుకునేందుకు ఇష్టపడలేదు.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో చాలా కాలం శ్రీలక్ష్మి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆమె తెలంగాణ క్యాడర్కు వెళ్లిపోయారు. జగన్ గెలవగానే విజయ్ సాయి రెడ్డి తో పాటు ఢిల్లీలో లాబీయింగ్ చేసుకున్నారు.తిరిగి ఏపీలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. రాజధాని రైతుల కౌలు కూడా కోర్టు చెప్పినా ఇవ్వకపోవడంతో పాటు అనేక తప్పుడు నిర్ణయాల్లో ఆమె పాత్ర కీలకం. శ్రీ లక్ష్మీ ఇచ్చిన జీవోలను కోర్టులు ఎన్నోసార్లు కొట్టివేశాయి. చాలా రకాలుగా తప్పుడు నిర్ణయాల్లో ఆమె భాగస్వామిగా తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ ఆమెపై ఎన్ని కేసులు పడతాయో అంచనా వేయడం చాలా కష్టం. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు పూల బొకే ఇవ్వడానికి ప్రయత్నించారు ఆమె. కానీ చంద్రబాబు తిరస్కరించారు. మరో మంత్రికి సైతం అదే మాదిరిగా బొకే ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

మరో వివాదాస్పద ఐఏఎస్ గా పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. విద్యా శాఖకు బాధ్యుడిగా ఉన్న ఆయన ఉపాధ్యాయులను వేధించారన్న విమర్శ ఉంది. విద్యా శాఖలో రోజుకో జీవో, పూటకో జీవోతో ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆకస్మిక సందర్శనల పేరుతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులను బెంబేలెత్తించారు. జగన్ ముందు మోకాళ్లపై నిలబడి పనిచేస్తుంటారు అన్న విమర్శ ఉంది. అందుకే ఈయనపై సైతం చంద్రబాబు వేటు వేశారు. కనీసం పోస్టింగ్ ఇవ్వలేదు.

ఇక రజత్ భార్గవ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన అధికారి. కానీ చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించడానికి ఆయనే పావుగా మారిపోయారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు తాను అక్రమాలకు పాల్పడ్డానని అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. అసలు అక్రమాలే జరగని అంశాల్లో సైతం.. అక్రమాలు జరిగినట్లు వాంగ్మూలం ఇవ్వడం, దానికి చంద్రబాబు కారణమని చెప్పడం సంచలనం గా మారింది. వైసీపీ పెద్దలు బెదిరించడంతోనే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని రజత్ భార్గవ్ వివరణ ఇచ్చినా ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు వినలేదు. వీరందరికీ స్థానచలనం తప్పలేదు. భవిష్యత్తులో వీరికి పోస్టింగులు దక్కడం కష్టమేనని కూడా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular