AP New Industries: ఆంధ్రప్రదేశ్లో( Andhra Pradesh) ఇప్పుడు వింత పరిస్థితి కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలే అవుతోంది. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులు తెస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే చేస్తోంది. భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెబుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంవోయూలు, ఒప్పందాలు, భూ కేటాయింపులు జరిగిన తర్వాత మాత్రమే శంకుస్థాపనలు జరుగుతాయి. కార్యకలాపాలు మొదలెడతారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంవోయూలు, ఒప్పందాలతో పనిలేదు. నేరుగా తాత్కాలిక కార్యాలయాలను తెరుస్తున్నారు. శాశ్వత కార్యాలయాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. నిన్ననే విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగతా ఐటీ సంస్థలకు సంబంధించిన కార్యాలయ భవనాలకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. ఒకవైపు తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు.. అదే సమయంలో భవనాలకు శంకుస్థాపన అనేది మాత్రం నిజంగా గుర్తించాల్సిన విషయం.
* ఆ భయం లేకుండా..
వైసిపి( YSR Congress party) ఐదేళ్ల పాలన చూసాం. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా వైసిపి పరిస్థితి చూసిన తర్వాత ఏపీ వైపు ఏ పరిశ్రమ కూడా చూడలేదు. అయితే మళ్లీ అధికారం మాదే అంటున్నారు వైసీపీ నేతలు. ఈ లెక్కన పరిశ్రమలు ఏపీకి రాకపోవాలి. ఎందుకంటే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనని పెట్టుబడి పెట్టే వారికి ఉంటుంది. కానీ వారంతా ముందుకు వస్తున్నారు అంటే ముమ్మాటికి చంద్రబాబు బ్రాండ్ కారణం. ఆపై కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకెళుతుండడం ఒక కారణం. అందుకే వైసిపి భవిష్యత్తులో వస్తుంది. ఇప్పటి ప్రభుత్వనికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అనే భయం మాత్రం లేకుండా పరిశ్రమలు ముందుకు వస్తుండడం నిజంగా శుభ పరిణామం. సాధారణంగా ప్రభుత్వాలు అంటే పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో జరిగే కాలం పెద్దదిగా ఉంటుంది. అన్ని రకాల ప్రక్రియలు జరిగి కార్యకలాపాలు ప్రారంభించేసరికి సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. నెలల వ్యవధిలోనే పరిశ్రమల ఏర్పాటుతోపాటు కార్యకలాపాలు మొదలు పెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం.
* లోకేష్ పర్యటనల ఫలితం..
ఒక పరిశ్రమ పెట్టుబడులు పెట్టేందుకు ఏళ్ల తరబడి కాలం పట్టేది. వారితో చర్చలు, ఒప్పందాలు, ఎంవోయూలు అంటూ కాలయాపన జరిగేది. కూటమి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) విదేశాలకు వెళ్లి వచ్చారు. పెట్టుబడుల కోసం అమెరికాతో పాటు లండన్ వెళ్లారు. ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. ఎంవోయూలు అస్సలు జరగలేదు. అలా విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత లోకేష్ పై సూటి పోటి మాటలు నడిచాయి. ఏవి పెట్టుబడులు అంటూ ప్రశ్నించిన మేధావులే అధికం. కానీ అలా వెళ్లిన లోకేష్ ఒప్పందాలతో పని లేకుండా.. ఎంఓయులతో పని లేకుండా నేరుగా కార్యాలయాల శంకుస్థాపన చేయిస్తున్నారు. నాటి విదేశీ పర్యటనల ఫలితమే నేటి శంకుస్థాపనలు. కానీ ఈ విషయాన్ని తెలుసుకోక.. గుర్తించలేక మేధావులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం చెయ్యదలచుకున్నది, చేస్తాం అనుకుంటున్నది మాత్రం సులువుగా చేసేస్తోంది. ఇక గుర్తించాల్సింది ప్రజలే.