Pithapuram Varma: ఏపీలో( Andhra Pradesh) 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటా కింద ఈ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 164 సీట్లతో బలంగా ఉంది టిడిపి కూటమి. దీంతో ఐదు స్థానాలను సునాయాసంగానే సొంతం చేసుకుంటుంది. అయితే ఈ ఐదు పదవులపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. తమకంటే తమకు తప్పకుండా అవకాశం వస్తుందని వారంతా భావిస్తున్నారు. ఈ జాబితాలో పిఠాపురం వర్మ ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న వర్మకు ఎటువంటి పదవి దక్కలేదు. దీంతో ఆయనలో ఒక రకమైన అసహనం వ్యక్తం అయింది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ద్వారా అది అర్థమైంది. కానీ ఇప్పుడు అదే ట్వీట్ ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్సీ పదవి ఆశపై నీళ్లు చల్లేలా ఉంది.
Also Read: శాశ్వత రాజకీయ శక్తిగా ఎదుగుతున్న జనసేన
* ఈ ఎన్నికల్లో త్యాగం
ఈ ఎన్నికల్లో పిఠాపురం( Pithapuram ) నుంచి తప్పుకున్నారు వర్మ. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు పవన్ కళ్యాణ్. కానీ రెండు చోట్ల ఓటమి ఎదురైంది. దీంతో 2024 ఎన్నికల్లో జాగ్రత్తపడ్డారు పవన్ కళ్యాణ్. గెలుపు అవకాశం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. అలా ఆయన దృష్టిలో పడింది పిఠాపురం నియోజకవర్గం. అయితే అప్పటికే అక్కడ పోటీ చేసేందుకు వర్మ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ తో మనస్థాపానికి గురయ్యారు. అయితే చంద్రబాబు పిలిచి మాట్లాడేసరికి మెత్తబడ్డారు. పోటీ నుంచి తప్పుకొని పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు.
* ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో..
అయితే అప్పట్లో కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తామని వర్మకు హామీ ఇచ్చినట్లు ప్రచారం నడిచింది. అయితే ఎమ్మెల్సీలు ఖాళీ అయినా వర్మ పేరు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇటువంటి తరుణంలో ఆయనలో ఒక రకమైన అసహనం పెరిగింది. అందుకే తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గెలుపు.. ఆయన విజయం కాదన్నట్టు అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది. అందులో కూడా వర్మ ఎన్నికల ప్రచారం చేసిన వీడియోలు ఉన్నాయి. అందులో కూడా ఎక్కడ పవన్ కనిపించడం లేదు. అయితే అక్కడకు కొద్దిగా గంటలకి ఆ పోస్టును డిలీట్ చేశారు. అది తనకు తెలియకుండా.. తన సోషల్ మీడియా అకౌంట్ ను నిర్వహించే ప్రతినిధులు చేశారంటూ చెప్పుకొచ్చారు వర్మ. అయితే అంతటి వివాదాస్పదమైన పోస్టును ఆయన అనుమతి లేకుండా ఎవరు చేయరు అన్న అనుమానం ఉంది.
* పిఠాపురంలో మారుతున్న సీన్
అయితే పిఠాపురంలో( pittapuram ) ఎన్నికల ఫలితాలు అనంతరం పరిస్థితి మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో అక్కడ జనసైనికులు చాలా యాక్టివ్ అయ్యారు. వారితో వర్మకు గ్యాప్ పెరిగింది. వరుసగా అక్కడ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో వర్మలో సైతం ఒక రకమైన బాధ వ్యక్తం అయింది. ఆ క్రమంలోనే ఈ పోస్టు వైరల్ అయినట్లు తెలుస్తోంది. అయితే అప్పటివరకు వర్మ పట్ల పవన్ కళ్యాణ్ కు మంచి అభిప్రాయం కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ పోస్ట్ చేసిన తర్వాత ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అనుమతిస్తే కానీ చంద్రబాబు వర్మకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.