Delhi CM Rekha Gupta
Delhi CM Rekha Gupta : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆప్(AAP) కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సోషల్ మీడియాలో బిజెపి ముఖ్యమంత్రి రేఖా గుప్తాను టార్గెట్ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రేఖగుప్తా బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించాలని ఆరోపణలు చేసింది. ఆప్ నేత అతిషీ మర్లేనా ట్వీట్ కూడా చేసింది. అయితే దీన్ని మర్చిపోకముందే ఆప్ మరో సంచలన వీడియో బయటపెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో 13 సెకండ్ల వీడియోను షేర్ చేసింది.. “ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త నిద్రపోతున్నారని.. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలని అసెంబ్లీకి పంపిస్తే.. శాసనసభ సమావేశంలో జరుగుతుండగా ముఖ్యమంత్రి గారు నిద్రపోతున్నారని” విమర్శలు చేసింది. “ముఖ్యమంత్రి గారు అంబేద్కర్, భగత్ సింగ్ ను అవమానించడంలో సమయం తీసుకున్నారు. ఆ సమయంలో కొంత భాగం అసెంబ్లీ చర్చలపై కూడా దృష్టి సారిస్తే ఢిల్లీ బాగుపడుతుంది. ఇకపై వాటిపై దృష్టి సారించాలని” వ్యాఖ్యానించింది. ఆప్ షేర్ చేసిన వీడియోలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖగుప్త కళ్ళు మూసుకునట్టు కనిపించారు.
Also Read : ఎవరీ రేఖా గుప్తా.. హేమా హేమీలుండగా బిజెపి అధిష్టానం ఈమెనే సీఎంగా ఎందుకు ప్రకటించింది?
బిజెపి నేతల కౌంటర్
ఆప్ నేతలు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కళ్ళు మూసుకున్న వీడియోని షేర్ చేసి.. నిద్రపోతున్నట్టుగా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేసిన అరవింద్ కేజ్రీవాల్ కళ్ళు మూసుకున్న వీడియోలను.. నిద్రపోతున్నట్టుగా ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. “ఇక్కడ నిద్రపోతున్న వ్యక్తి ఎవరో మీరు గమనించాలి.. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఏం చేశాడో కూడా మీరు గమనించాలి. మద్యం కుంభకోణం నుంచి మొదలుపెడితే సీఎం కార్యాలయం వరకు ప్రతి దాంట్లో ఆయన కమిషన్లు తీసుకున్నారు. అందువల్లే జైలుకు వెళ్లి వచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇకపై యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. ఆ కేసుల్లో ఉన్న ఒత్తిడిని ఎదుర్కోవాలంటే ఇంకా చాలా చేయాలని” బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు.. ఒక మహిళా ముఖ్యమంత్రి కి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఆప్ నేతలు ప్రవర్తిస్తున్నారని.. అధికారం కోల్పోయిన తర్వాత వారికి మతి భ్రమించిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి చమకబారు వీడియోల వల్ల ఆప్ పరువు మరింత పోతుందని.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని బిజెపి నాయకులు మండిపడుతున్నారు.. ” మహిళకు బిజెపి గొప్ప స్థానం కల్పించింది. ఆమెను ముఖ్యమంత్రిని చేసింది. సముచిత గౌరవం ఇచ్చి మహోన్నత స్థానం కల్పించింది. అలాంటి మహిళను పట్టుకొని ఆప్ నేతలు పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆప్ నేతలు తాము ఎందుకు ఓడిపోయామో గుర్తు చేసుకోవాలని” బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి వీడియో ద్వారా ఆప్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా సోషల్ మీడియాలో పరిస్థితి మారిపోయింది.
CM मोहतरमा के दो रूप‼️
1️⃣ विपक्ष में रहते हुए जनता के काम रोकना
2️⃣ सरकार में रहते हुए सदन के अंदर कुंभकर्णी नींद सोना pic.twitter.com/zY6E72pquU— AAP (@AamAadmiParty) February 26, 2025