spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Allu Arjun: Breaking news : అల్లు అర్జున్ ని త్వరలో కలవబోతున్న మాజీ సీఎం...

Allu Arjun: Breaking news : అల్లు అర్జున్ ని త్వరలో కలవబోతున్న మాజీ సీఎం జగన్..వైసీపీ సర్కిల్స్ లో హాట్ టాపిక్!

Allu Arjun:  అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం లో మిగతావాళ్ళు ఎలా స్పందించినా, వైసీపీ పార్టీ శ్రేణులు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులను జైలుకు తీసుకొని పొయ్యినంత రేంజ్ లో బాధపడుతూ స్పందిస్తున్న సంఘటనలను గత రెండు మూడు రోజులుగా మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు , ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం జగన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై విచారణ వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేసాడు. ఇదంతా నిజంగా బాధపడి, అల్లు అర్జున్ మీద సానుభూతి చూపించి ఉండుంటే అంత బాగానే ఉంటుంది. కానీ వైసీపీ పార్టీ అల్లు అర్జున్ ని రాజకీయంగా వాడుకొని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వరుసగా జరుగుతున్న ఈ ఘటనలను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఎందుకు కలవడానికి రాలేదు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేసాడు.

అంతే కాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు హస్తం ఉందని, చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఒకప్పుడు మంచి సన్నిహితుడు, గురువు కాబట్టి, ఆయన ఇచ్చే ఆదేశాల కారణంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసాడని, ట్విట్టర్ లో నిందలు వేసాడు. ఇక్కడే అందరికీ అర్థమైంది, కేవలం ఈ ఘటనని రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కలుస్తాడని వార్తలు వినిపించాయి కానీ, వాటిల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ఛాన్స్ ని వైసీపీ పార్టీ ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. నిన్నటి నుండి అల్లు అర్జున్ ని టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ వచ్చి కలవడం ని మనమంతా చూసాము. పలువురు రాజకీయ నాయకులు కూడా కలిశారు.

ఇప్పుడు మాజీ సీఎం జగన్ కూడా అల్లు అర్జున్ ని కలిసి సంఘీభావం వ్యక్తం చేయబోతున్నాడని వైసీపీ సోషల్ మీడియా సర్కిల్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటి వరకు మీడియా కి సమాచారం రాలేదు కానీ, ఒకవేళ కలిస్తే మాత్రం అది పెద్ద సంచలనమే అని చెప్పొచ్చు. కేవలం శిల్పా రవి ని కలిసినందుకే అల్లు అర్జున్ పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ నెగటివిటీ ఏర్పడింది. ఇక పవన్ కళ్యాణ్ ని, చిరంజీవి ని ముప్పుతిప్పలు పెట్టిన జగన్ ని అల్లు అర్జున్ కలిస్తే మాత్రం ఇక జీవితం లో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని క్షమించరు. రాజకీయ లబ్ది కోసం, పవన్ కళ్యాణ్ ని నెగటివ్ చేయడం కోసం, జగన్ కలిసినా కలుస్తాడు. వచ్చి కలుస్తాను అన్నవాళ్లను రావొద్దు వెళ్ళిపో అని చెప్పలేరు కదా ఎవరైనా, కాబట్టి అల్లు అర్జున్ కి ఇది నిస్సహాయత పరిస్థితి, దీనిని అభిమానులు గమనించాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
Oktelugu Epaper