Homeఆంధ్రప్రదేశ్‌Flood victims Troubles  : వరద సాయం, ఆహారం కోసం కొట్టుకుంటున్నారు.. దారుణంగా విజయవాడలో పరిస్థితులు

Flood victims Troubles  : వరద సాయం, ఆహారం కోసం కొట్టుకుంటున్నారు.. దారుణంగా విజయవాడలో పరిస్థితులు

Flood victims Troubles : విజయవాడలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఇంకా వరదలోనే చాలా ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విశేష సేవలు అందిస్తున్నాయి. మరోవైపు డ్రోన్లతో పాటు హెలిక్యాప్టర్లలో ఆహార పంపిణీ జరుగుతోంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దేవస్థానాల నుంచి పెద్ద ఎత్తున ఆహారం విజయవాడ నగరానికి చేరుకుంటోంది. ఇంకోవైపు అక్షయపాత్ర సంస్థ రంగంలోకి దిగింది. లక్షలాదిమందికి ఆహారం తయారు చేసి అందిస్తోంది. అయితే ఇంత చేస్తున్న కొన్ని ప్రాంతాలకు ఆహారం అందడం లేదు. హెలిక్యాప్టర్ కనిపిస్తే చాలు జనాలు ఒకేసారి ముందుకు వస్తున్నారు.బురదలో పడుతున్న ఆహార ప్యాకెట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. వాహనాలు వెళ్లే ప్రాంతాలకు.. లారీల్లో ఆహారం తరలిస్తుండగా.. ముంపు ప్రాంతాలకు ఇంకా పడవలపైనే ఆహార ప్యాకెట్లను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జనాల మధ్య కొట్లాట జరుగుతోంది. ఆహారం ప్యాకెట్లు దక్కించుకునే క్రమంలో గొడవలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారుతోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహార పంపిణీ చేపడుతున్నట్లు చెబుతోంది.కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అయితే ఇదే అదునుగా వైసీపీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది. అస్సలు విజయవాడ వరద బాధితులకు ఆహారం అందడం లేదని చెబుతూ.. సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

* సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆహార పదార్థాల పంపిణీ విషయంలో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. మంత్రులు తప్పు చేసిన విడిచి పెట్టేది లేదని హెచ్చరికలు పంపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆహారం పంపిణీలో అధికారులు అలసత్వం ప్రదర్శించారని.. వారంతా వైసిపి అస్మదీయ అధికారులేనని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వారంతా ఆహార పంపిణీలో జాప్యం చేశారన్నది ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు చంద్రబాబు. పూర్తి నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు.

* రిటైనింగ్ వాల్ పై రాజకీయం
మరోవైపు కృష్ణానది వరదలు విజయవాడ నగరానికి తాకకుండా ఉండేందుకు.. రిటైనింగ్ వాల్ ను నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో అప్పటి సీఎం జగన్ దానిని ప్రారంభించారు. తాజాగా జగన్ వరద బాధితులను పర్యటించిన క్రమంలో ఆ రిటైనింగ్ వాల్ ను పరిశీలించారు. ఆ ప్రాంతంలో లక్షలాదిమంది ముంపు బారిన పడకుండా చేసిన ఘనత జగన్ దేనిని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. జగన్ ఎంతో ముందు చూపుతో రిటైనింగ్ వాల్ ను నిర్మించడం వల్లే ఆ ప్రాంతానికి పెనుముప్పు తప్పిందని వైసీపీ సోషల్ మీడియా అదేపనిగా ప్రచారం చేస్తోంది. ఆహార పంపిణీలో లోపాలపై కూడా వీడియోలతో పాటు ఫోటోలను పోస్ట్ చేస్తోంది.

* వైసిపి అతి ప్రచారం
అయితే విజయవాడ నగరానికి గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగింది. ఇది ప్రకృతి ప్రకోపమే. అయితే ఇందులో కూడా రాజకీయాలను అన్వేషిస్తోంది వైసిపి. మొన్నటి వరకు ఆ పార్టీ అధికారంలో ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతోంది. ఈ క్రమంలో విమర్శలు చేస్తున్న వైసీపీపై టిడిపి కౌంటర్ అటాక్ చేస్తోంది. అయితే ఇంతటి విపత్తు వేళ రాజకీయ విమర్శలు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అధికార విపక్ష చర్యలను ప్రజలు యావగించుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా అతిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో అధికారపక్షం సోషల్ మీడియా కూడా ప్రచారానికి ప్రయారిటీ ఇస్తోందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఇంతటి విపత్తు కాలంలో సంయమనం పాటించాల్సిన అవసరం అందరిపై ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version