Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: జగన్ కట్టడికి చంద్రబాబు ప్లాన్.. ఢిల్లీ సడన్ టూర్ అజెండా అదే!

CM Chandrababu: జగన్ కట్టడికి చంద్రబాబు ప్లాన్.. ఢిల్లీ సడన్ టూర్ అజెండా అదే!

CM Chandrababu: చంద్రబాబు మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈరోజు సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రాజకీయ అంశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం జలవనరుల శాఖ మంత్రిని కలుసుకున్నారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం అని కీలక అంశాలపై చంద్రబాబు చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి.అయితే ఒక్క నిధుల సమీకరణే కాదు.. రాజకీయంగాను చర్చించి ఉంటారని తెలుస్తోంది.ఇటీవల జగన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఈ విషయాలను చంద్రబాబు తప్పకుండా కేంద్ర పెద్దలతో చర్చించి ఉంటారని తెలుస్తోంది. జగన్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరినట్లు జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది.ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక ఏపీ ప్రయోజనాల కంటే..రాజకీయ అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిపై చర్చించి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

* ఆందోళనలకు జగన్ పిలుపు
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వ విధానాలపై జగన్ ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్ కూటమి నేతలు జగన్ కు అండగా నిలుస్తున్నారు. పార్లమెంటులో సైతం జగన్ ఇండియా కూటమి వైపు నిలుస్తున్నారు. అందుకే జగన్ ను నిలువరించాలని చంద్రబాబు కేంద్ర పెద్దలను కోరినట్లు సమాచారం. ముఖ్యంగా పాత కేసులను తిరగదొడ్డి జగన్ కు అడ్డుకట్ట వేయాలని సూచించినట్లు సమాచారం.

* పాత కేసులు తెరపైకి
జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్న సంగతి తెలిసిందే. గత పది సంవత్సరాలుగా ఆయన బెయిల్ పై ఉన్నారు. మరోవైపు 2019 ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ కేసులో సొంత కుటుంబ సభ్యులే నిందితులుగా సిబిఐ అనుమానించింది. నిందితులకు జగన్ కొమ్ముకాశారని స్వయంగా వివేక కుమార్తె సునీత ఆరోపించారు. ఇందులో జగన్ పాత్ర ఉందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు కొనసాగితే జగన్ అడ్డంగా బుక్ కావడం ఖాయం. ఇదే విషయాన్ని చంద్రబాబు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కేసులతో జగన్ ను నిలువరిస్తే ఆయన రాజకీయంగా పైకి లేవడం అసాధ్యమని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

* సడన్ టూర్ అందుకే
వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ టూర్ సడన్ గా నిశ్చయమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకటించలేదు. పెద్దగా హడావిడి లేదు. కానీ మూడు రోజులపాటు తన పర్యటన ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఢిల్లీ వెళ్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నా.. రాజకీయ అంశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అనుమానం. త్వరలో జగన్ కేసులు తెరపైకి వస్తాయని.. ఆయనకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular