AP Assembly Elections
AP Assembly Elections: ఉత్కంఠకు తెరపడింది. సస్పెన్స్ కు వీగి పోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబితా విడుదలైంది. ఇంతకీ ఎవరికి ఏ సీట్లు దక్కాయి అంటే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని టిడిపి – జనసేన కూటమి తాము పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించాయి. శనివారం ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు నివాసంలో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తం 118 స్థానాలకు సంబంధించి ఇరు పార్టీలు పోటీ చేస్తున్నామని ప్రకటించాయి.
పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలు దక్కాయి. టిడిపి తరఫున తొలి జాబితాలో 94 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. జనసేన పార్టీకి సంబంధించి 24 స్థానాలకు గానూ ఐదుగురిని మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగతా వారి పేర్లను త్వరలో వెల్లడిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. జాబితా విడుదలైన తర్వాత బిజెపి తో పొత్తు ప్రస్తావన వచ్చింది. దీంతో అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ చేరో మాట చెప్పారు. మా పొత్తుకు బిజెపి ఆశీస్సులు ఉన్నాయని పవన్ వెల్లడించారు. ” టిడిపి జనసేన పొత్తు ఖరారయింది. పవన్ చెప్పినట్టు బిజెపి కలసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదిరింది. త్వరలో మిగతా స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడిస్తామని” చంద్రబాబు నాయుడు పేర్కొనడం విశేషం. తొలి జాబితా నేపథ్యంలో చంద్రబాబు నాయుడు టిడిపి సీనియర్ల పేర్లను ప్రస్తావించలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు పేరు జాబితాలో కనిపించలేదు. విశాఖపట్నంలో కీలక నేతగా ఉన్న గంట శ్రీనివాసరావు పేరు కూడా జాబితాలో లేకపోవడం విశేషం. వీరికి టికెట్లు వస్తాయా? లేకుంటే దాటవేస్తారా? అనేది తేలాల్సి ఉంది.
టిడిపి అభ్యర్థులు వీరే
శ్రీకాకుళం
ఇచ్చాపురం- బెందాళం అశోక్, టెక్కలి- కింజారపు అచ్చం నాయుడు, ఆముదాలవలస – కూన రవికుమార్, రాజాం – కొండ్రు మురళీమోహన్, కురుపాం- జగదీశ్వరి, పార్వతీపురం- విజయ్, సాలూరు సంధ్యారాణి, బొబ్బిలి- రంగారావు, గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం – విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్- రామకృష్ణబాబు, విశాఖ పట్నం వెస్ట్- గణబాబు, అరకు వ్యాలీ- దొన్నుదొర, పాయకరావుపేట- వంగలపూడి అనిత, నర్సీపట్నం- చింతకాయల అయ్యన్నపాత్రుడు.
తూర్పుగోదావరి
తుణి – యనమల దివ్య, పెద్దాపురం- చినరాజప్ప, అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు, గన్నవరం – రాజేష్ కుమార్, కొత్తపేట – బండారు సత్యానందరావు, మండపేట- జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ, ఆచంట- పితాని సత్యనారాయణ, పాలకొల్లు- నిమ్మల రామానాయుడు, ఉండి- మంతెన రామరాజు, తణుకు- రాధాకృష్ణ, ఏలూరు- బడేటి రాధాకృష్ణ.
కృష్ణా జిల్లా
చింతలపూడి- సుంగా రోషన్, తిరువూరు- కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు -పార్థసారథి, గన్నవరం- యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ- వెనిగండ్ల రాము, పెడన – కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం- కొల్లు రవీంద్ర, పామర్రు- వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ -బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్రావు, నందిగామ – తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట- శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య.
గుంటూరు
తాటికొండ- తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి – నారా లోకేష్, పొన్నూరు- ధూళిపాల నరేంద్ర, వేమూరు – నక్కా ఆనంద్ బాబు, రేపల్లె – సత్యప్రసాద్, బాపట్ల- నరేంద్ర వర్మ, పత్తిపాడు- రామాంజనేయులు, చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి -కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ- జీవీ ఆంజనేయులు, మాచర్ల- బ్రహ్మానంద రెడ్డి, ఎరగొండపాలెం -గూడూరు ఎరి కిషన్ బాబు, పర్చూరు- ఏలూరు సాంబశివరావు, అద్దంకి- గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు – నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు- జనార్దన్ రావు, కొండపి- వీరాంజనేయ స్వామి.
నెల్లూరు జిల్లా
కావలి- కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ- నారాయణ, నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు- పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేట- విజయ శ్రీ, ఉదయగిరి సురేష్.
కడప
కడప -మాధవి రెడ్డి, రాయచోటి -రాంప్రసాద్ రెడ్డి, న్ పులివెందుల- రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్.
కర్నూలు
ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియా రెడ్డి, శ్రీశైలం- రాజశేఖర్ రెడ్డి, కర్నూలు- భరత్, పాణ్యం- గౌరు చరిత రెడ్డి, నంద్యాల- ఫారూఖ్, బనగానపల్లె – జనార్దన్ రెడ్డి, డోన్- సూర్య ప్రకాష్ రెడ్డి, పత్తికొండ – శ్యాంబాబు, కోడుమూరు- దస్తగిరి.
అనంతపురం జిల్లా
రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ- పయ్యావుల కేశవ్, తాడిపత్రి- జేసీ ఆస్మిత్ రెడ్డి, శింగనమల- బండారు శ్రావణి శ్రీ, కళ్యాణదుర్గం- సురేందర్ బాబు, రాప్తాడు – పరిటాల సునీత, మడకశిర- సునీల్ కుమార్, హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ, పెనుగొండ – సవిత, తంబళ్లపల్లె- జయచంద్ర రెడ్డి, పీలేరు- నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.
చిత్తూరు
నగరి – గాలి భాను ప్రకాష్, గంగాధర- థామస్, చిత్తూరు- జగన్మోహన్, పలమనేరు- అమర్నాథ్ రెడ్డి, కుప్పం- నారా చంద్రబాబు నాయుడు.. ఇలా 94 స్థానాలలో టిడిపి అభ్యర్థులను ప్రకటించింది.
జనసేన పార్టీకి సంబంధించి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. తెనాలి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొణతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ లో పంతం నానాజీకి టికెట్లు కేటాయిస్తూ జనసేన నిర్ణయం ప్రకటించింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: First list of jana sena and tdp released what seats have been allotted to whom
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com