Conductor Attacks Passenger: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధ ప్రయాణికుడి పై మహిళా కండక్టర్ ( lady conductor) దాడి చేసింది. ఈ ఘటన కృష్ణాజిల్లాలో వెలుగు చూసింది. కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో వివాదం మరింత పెద్దది అయింది. ఎందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పాట్ల వల్లూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్ది బోయిన మల్లికార్జున రావు అనే వృద్ధుడు ఉయ్యూరు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్‌కు 200 రూపాయల నోటు ఇచ్చాడు. పెద్ద నోటు ఇస్తే ఎట్లా అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై ఘర్షణకు దారి తీసింది.
Also Read: మారిన జగన్ వ్యూహం
* మాటామాటా పెరిగి ఘర్షణ
చిల్లర లేదని.. బస్సు దిగిపోమంటూ కనకదుర్గ కాలనీ( kanakadurga Colony ) వద్ద మహిళా కండక్టర్ ఆ వృద్ధుడిని కిందకు దించేసింది. ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. ఒక్కసారిగా ఆ మహిళా కండక్టర్ వృద్ధుడిపై దాడి చేసింది. ఈ ఘటనను వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది విపరీతంగా వైరల్ అయింది. అయితే సదరు మహిళా కండక్టర్ తోటి ప్రయాణికులతో చాలాసార్లు దురుసుగా ప్రవర్తించారని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే ఆమెపై ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
* సోషల్ మీడియాలో వైరల్..
అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో( social media) విపరీతంగా వైరల్ అయింది. అంతటా చర్చకు దారి తీసింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఉయ్యూరు ఆర్టీసీ డిపో ఇంచార్జ్ మేనేజర్ పెద్దిరాజు స్పందిస్తూ.. ఘటనపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికుడి పై దాడిని ఖండించారు. అయితే ఇప్పటివరకు ఆర్టీసీ సిబ్బందిపైనే ప్రయాణికులు దాడి చేసేవారు. ఇప్పుడు ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులపై దాడి చేయడం విశేషం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కానుంది. అప్పుడు మరిన్ని వివాదాలు పెరిగే అవకాశం ఉంది.
రూ.200 నోటు ఇస్తావా అంటూ గల్లా పట్టుకొని వృద్ధుడిపై దాడి చేసిన మహిళా కండక్టర్
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల కేంద్రంలో వృద్ధుడు పెద్దిబోయిన మల్లిఖార్జునరావుపై దాడి చేసిన మహిళా కండక్టర్
ఉయ్యూరు వెళ్లడానికి చిల్లర ఇవ్వకుండా రూ.200ల పెద్ద నోటు ఇస్తే ఎట్లా అంటూ కండక్టర్ దూషించడంతో… pic.twitter.com/cUAmTjILoV
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2025