Farmers Fund Release in AP : తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఒక మంచి శుభవార్త తెలిపింది. ప్రస్తుతం వేసవికాలం ముగిసిపోయి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్న సమయంలో ఖరీఫ్ పంటల కోసం రెడీ అవుతున్న రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన పథకానికి సంబంధించి నిధులను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సకాలంలో పంటలు వేసేందుకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట వేసుకోవాలనుకునే రైతులకు రాష్ట్ర వాటా కింద 50% సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం ముందస్తు ప్రీమియం గా చెల్లించేందుకు నిధులను రిలీజ్ చేసింది. ప్రభుత్వం ఖరీఫ్ సంబంధిత భీమా పథకాల కోసం మొత్తం రూ.132.58 కోట్ల నిధులను రిలీజ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : ఏపీ డీఎస్సీ 2025..మారిన పరీక్షల షెడ్యూల్..
రాష్ట్రంలో ఖరీఫ్ పంట సీజన్ మొదలు కావడంతో పంట బీమా పథకాలను అనుకున్న సమయంలో అందజేయడానికి ఇవి ఉపయోగపడతాయని తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది రైతులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాళ్లకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు అని తెలుస్తుంది. ఈ క్రమంలో రైతులకు బీమా పథకాలు అనుకున్న సమయంలో ఇన్పుట్ సబ్సిడీ అందేందుకు చాలా బాగా పనికి వస్తాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సహాయపడే ఈ బీమా పథకాలకు ముందస్తు ప్రీమియం చెల్లించేందుకు తన వాటా రిలీజ్ చేసింది.
రాష్ట్రం బాటా తో పాటు కేంద్రం వాటా కూడా కలిపి బీమా అందించే సంస్థలకు ఈ ప్రీమియాన్ని చెల్లించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారికి ఎంతగానో ప్రయోజనం కలిగిస్తుంది అని చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పథకం కింద కూడా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు.