Balakrishna: బాలయ్య కోసం రంగం లోకి దిగుతున్న మలయాళం సూపర్ స్టార్…

సినిమాల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న బాలయ్య బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Written By: Gopi, Updated On : June 10, 2024 9:13 am

Balakrishna

Follow us on

Balakrishna: నందమూరి నటసింహం గా మంచి గుర్తింపు పొందిన నటుడు బాలయ్య బాబు.. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక సంచలనంగానే మారుతుంది. ఇక ఆయన రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో హిందూపురం ఎమ్మెల్యే గా పోటీ చేసి మంచి విజయం సాధించి హ్యాట్రిక్ ను నమోదు చేశాడు…

ఇక మొత్తానికైతే బాలయ్య బాబు అటు పొలిటికల్ గా మంచి ఊపులో ఉన్నాడు. ఇక అలాగే సినిమాల పరంగా కూడా వరుసగా హ్యట్రిక్ విజయాలను సాధించి సినిమాల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న బాలయ్య బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇంక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కల్కి సినిమా నుంచి టీజర్ ను కూడా రిలీజ్ చేయాలని సినిమా మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మోహన్ లాల్ ఇప్పటికే బాలయ్య బాబు నటించిన
‘ గాండీవం ‘ సినిమాలో ఒక పాటలో కనిపిస్తాడు. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య బాబు సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈయన క్యారెక్టర్ ఏంటి అనేది సినిమా యూనిట్ అయితే బయటికి చెప్పడం లేదు.

కానీ ఈ సినిమాలో మోహన్ లాల్ మాత్రం ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తున్నాడు అనే వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ నటించడం వల్ల మలయాళం లో కూడా ఈ సినిమా భారీ మార్కెట్ ను అయితే క్రియేట్ చేసుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక బాలయ్య ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఆయనకి ఇది వరుసగా నాల్గోవ సక్సెస్ అవుతుంది… చూడాలి మరి బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేసాడు అనేది…