https://oktelugu.com/

Divvela Madhuri : విడాకులు రాగానే ఆ పని.. ప్రస్తుతానికి సహజీవనం.. ఓపెన్ అయిపోయిన దువ్వాడ ప్రియురాలు మాధురి

సీరియల్ ఎపిసోడ్ లా సాగింది ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదం. చివరకు దువ్వాడ కొత్త ఇంటికి సన్నిహితురాలు మాధురి చేరడంతో సుఖాంతం అయింది. ఒకవైపు కోర్టులో కేసులు నడుస్తుండగా.. మాధురితో దువ్వాడ శ్రీనివాస్ చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. తాజాగా తిరుపతిలో కనువిందు చేసింది ఈ జంట.

Written By:
  • Dharma
  • , Updated On : October 8, 2024 / 12:30 PM IST

    Divvela Madhuri

    Follow us on

    Divvela Madhuri :  దువ్వాడ శ్రీనివాస్ తో వివాహం విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఆమె సన్నిహితురాలు దివ్వెల మాధురి. త్వరలో తమ పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియా కంట కనబడ్డారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తులు స్వామివారి కార్యక్రమాలను తిలకించేందుకు తరలివచ్చారు. తిరుమల భక్తులతో రద్దీగా ఉండగా ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు దువ్వాడ శ్రీనివాస్, సన్నిహితురాలు మాధురి. ఈ సందర్భంగా వివాహం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కుటుంబ వివాదం కోర్టులో నలుగుతున్న సంగతి తెలిసిందే. అది కొలిక్కి వచ్చాక పెళ్లి చేసుకుంటామని మాధురి ప్రకటించారు. అంతవరకు సహజీవనంలోనే ఉంటామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిని మాధురి పేరుతో రాసిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడే ఇద్దరూ ఉంటున్నారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ నటించిన వాలంటీర్ సినిమా రిలీజ్ అయింది. థియేటర్లలో కాకుండా యూట్యూబ్ ఛానల్లో దానిని విడుదల చేశారు.మరోవైపు సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి చేసిన రీల్స్ హల్చల్ చేస్తున్నాయి.

    * తెలుగు నాట వినోదం
    విజయవాడ వరదలు వరకు తెలుగు నాట వినోదం పంచింది దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్. మీడియాలో ఇదే ప్రధానమైన వార్తగా నిలిచింది. ఏకంగా చానల్లో డిబేట్లు పెట్టి మరి చర్చించారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఇద్దరు పిల్లలు.. శ్రీనివాస్ కొత్త ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. కానీ ఇంటికి తాళాలు వేసి ఉండడంతో రాత్రంతా అక్కడే గడిపారు. ఆ మరుసటి రోజు నుంచి ఇంటి ఆవరణలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి నిరసన కొనసాగించారు. అది మొదలు ఎన్నెన్నో ట్విస్టుల మధ్య ఈ వివాదం నడిచింది. చివరకు తనకు దువ్వాడ శ్రీనివాస్ రెండు కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నారని మాధురి చెప్పుకొచ్చారు. ఆ అప్పు బదులు దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిని మాధురి పేరిట రాశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. దువ్వాడ వాణి తన నిరసనను విరమించారు.

    * అవి తేలిన వెంటనే పెళ్లి
    అయితే అప్పటినుంచి ఆ ఇంట్లో మాధురి తో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో తాము సహజీవనంలో ఉన్నామని మాధురి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది ఆ జంట. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ కోర్టులో వివాదాలు ఉన్న దృష్ట్యా.. పెళ్లి చేసుకోలేదని.. అవి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటామని.. అందరికీ చెప్పి మరి వివాహం చేసుకుంటామని మాధురి ప్రకటించడం గమనార్హం.