Election results 2024 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. రెండు రాష్ట్రాల్లోనూ దూసుకుపోతున్న కాంగ్రెస్‌

ఇటీవల హర్యానా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌ అక్టోబర్‌ 8న(మంగళవారం) ప్రారంభమైంది. బీజేపీ హర్యానాలో హ్యాట్రిక్‌ కొడుతుందా.. కాంగ్రెస్‌ పవర్‌ బ్యాక్‌ అవుతుందా.. కశ్మీర్‌ పీఠం ఎవరిది అన్న ఉత్కఠ మధ్య కౌంటింగ్‌ ప్రారంభమైంది.

Written By: Raj Shekar, Updated On : October 8, 2024 12:43 pm

Election results 2024

Follow us on

Election results 2024 :  హర్యానా, జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల నేపథ్యంలో బీజేపీలో ఆందోళన నెలకొనగా, హస్తం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం(అక్టోబర్‌ 8న)ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. మొదటి గంటలో ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే వస్తున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో హస్తం పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి గంటలో హన్యానాలో కాంగ్రెస్‌ పార్టీ 60కిపైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కశ్మీర్‌లో ఫలితాలు రౌండ్‌ రౌండ్‌కు మారుతున్నాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు అక్టోబర్‌ 5న ఎన్నికలు జరిగాయి. 68 శాతం పోలింగ్‌ నమోదైంది. 93 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1న పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 90 స్థానాలకు 63.88 శాతం ఓటింగ్‌ నమోదైంది. కౌంటింగ్‌ కోసం 28 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హర్యానాలో హ్యాట్రిక్‌ విజయంపై బీజేపీ ధీమాగా ఉండగా, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల అంచనాతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఇక కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నేషనల్‌కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేశాయి. బీజేపీ, పీడీపీ ఒంటరిగా బరిలో దిగాయి. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓడుతుందని తెలిపాయి.

రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ దూకుడు..
ఇక ఉదయం 8 గంటలకు రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్‌ మొదలైంది. రెండింటిలో కాంగ్రెస్‌ ఆధిక్యం కనబరుస్తోంది. అధికారంవైపు దూసుకెళ్తోంది. జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌సీ కూటమి 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 28, పీడీపీ 5, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హర్యానాలో కాంగ్రెస్‌ 57 స్థానాల్లో ఆధికంలో ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. బీజేపీ 22 స్థానాల్లో ఐఎన్‌ఎల్‌డీ 2, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.