Duvvada Srinivas: ఆమె పుట్టింటికి.. మెట్టినింటికి దూరమైంది.. ఇప్పుడు ప్రాణాలమీదకు తెచ్చుకుంది.. మాధురిపై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు!

వారం రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వ్యవహారం.. క్లైమాక్స్‌కు చేరినట్లు కనిపిస్తోంది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుగా.. వ్యక్తిగత విషయాలను మీడియా రచ్చ చేస్తోంది.

Written By: Raj Shekar, Updated On : August 12, 2024 3:34 pm

duvvada srinivas

Follow us on

Duvvada Srinivas: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంతో తలెత్తిన గొడవలు చినికి చినికి గాలివానలా మారాయి. ఒకవైపు భార్య వాణి, మరోవైపు సహజీవనం చేస్తున్న మాధురి పోటాపోటీగా శ్రీనివాస్‌ నావాడు అంటే నా వాడు అని కొట్టుకుంటున్నారు. ఇద్దరి వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. ఇదే అదనుగా మీడియా కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా వారి కుటుంబ వ్యవహారాన్ని మరింత రచ్చకీడ్చి టీఆర్‌పీ రేటింగ్‌ కోసం పాకులాడుతున్నాయి. ఇద్దరినీ డిబేట్‌కు పిలిచి ఒకరినొకదు ధూషించుకునేలా చేశాయి. చివరకు ధర్నాలు చేస్తామని సవాల్‌ చేసుకునేలా చేసింది ఓ టీవీ ఛానెల్‌. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు శ్రీనివాస్‌కు దూరంగా ఉన్న వాణి ఇప్పుడు ధర్నా చేస్తోంది. ఇక డిప్రెషన్‌లోకి వెళ్లిన మాధురి రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మాధురి ఆరోగ్యంపై దువ్వాడ కీలక వ్యాఖ్యలు..
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధుని ఆరోగ్యంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మాధురిని పరామర్శించి, ధైర్యం చెప్పి రావాలనే ఉందని కానీ, బయటకు వెళ్తే తన భార్యా పిల్లలు తన ఇంటిని కబ్జా చేస్తారని ఆసుపత్రికి వెళ్లడం లేదన్నారు. మాధురి రోడ్డు ప్రమాద ఘటనపై స్పందిస్తూ.. డిప్రెషన్‌ కారణంగానే కారు యాక్సిడెంట్‌ జరిగినట్లు మాధురి తనతో చెప్పిందన్నారు. వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వాణి ఆరోపణలు చేయడంతో మాధురి మానసిక ఒత్తిడికి గురైందని వివరించారు. వాణి కారణంగానే మాధురి పుట్టింటికి, మెట్టినింటికి దూరమైందని తెలిపారు. మాధురి గతంలోనూ ఓసారి ఆత్మహత్యయత్నం చేసిందని చెప్పారు. ఆ సమయంలోనే ఆమెను తానే కాపాడానని తెలిపారు.

ప్రాణాలు తీసుకునేందుకు డ్రామా ఆడతారా?
ఇక మాధురి కారు ప్రమాదం ఓ డ్రామా అంటూ జరుగుతోన్న ప్రచారంపై దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు తీసుకునేందుకు ఎవరైనా డ్రామా ఆడతారా అని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు తీవ్రమైన గాయం అయిందని.. సంవత్సరంలోపు ఏమైనా జరగవచ్చని డాక్టర్లు చెప్పారన్నారు. భార్యభర్తల మధ్య తలెత్తే గొడవల్లో సమాజం అంతా భర్తనే వేలెత్తి చూపిస్తుందన్నారు దువ్వాడ. తన జీవితంలో భార్యతో అనుక్షణం నరకం అనుభవించానని, పిల్లలకు సైతం విషం నూరిపోసి తనపైకి ఉసిగొల్పిందని ఆరోపించారు. వాణి మనస్తత్వం తెలిసే రెండేళ్ల క్రితమే విడాకుల నోటీసు ఇచ్చానని స్పష్టం చేశారు.