Adani shares: సోమవారం స్టాక్ మార్కెట్లు తెరిచిన తర్వాత అదానీ గ్రూప్ నకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇది వారికి బ్లాక్ డే చెప్పవచ్చు. హిడెన్ బర్గ్ బహిర్గతపరిచిన కొత్త నివేదికతో అదానీ షేర్ల పతనం ప్రారంభమైంది. గతంలోనూ హిడెన్ బర్గ్ అదానీ కంపెనీలపై ఓ నివేదిక విడుదల చేసింది. పూర్తి సర్వే చేసిన అనంతరమే ఈ నివేదిక విడుదల చేస్తున్నట్లు హిడెన్ బర్గ్ చెప్పింది. ఈ నేపథ్యంలో అదానీ తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మరోసారి అదే రీతిలో అదానీ కంపెనీలపై అక్రమాల పేరిట ఓ నివేదికను హిడెన్ బర్గ్ రీసెర్చ్ చేసి విడుదల చేసింది. ముందుగానే భారత్ లో ఓ సంచలన విషయం చెప్పబోతున్నామంటూ ఆ కంపెనీ ప్రకటించింది. కానీ మరొకసారి అదానీ కంపెనీపైనే నివేదికను విడుదల చేసింది. కాగా సోమవారం మార్కెట్లు ప్రారంభమయ్యాక 17 శాతం నష్టంతో అదానీ షేర్లు మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం 9. 15 గంటలకు మొదలుకాగానే, అదానీ సేర్ల పతనం ఒక్కసారిగా ప్రారంభమైంది. ఇక అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ భారత్ స్టాక్ ఎక్చేంజీలో దాదాపు 17 శాతం నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతానికి కూడా ఈ విలువ రెడ్ లోనే కొనసుగతున్నది.9.30 గంటలకు భారత్ స్టాక్ మార్కెట్ లో 2.59 శాతం నష్టంతో రూ. 1,075.45 వద్ద కొనసాగుతున్నది.
మరోవైపు అదానీ గ్రూపునకు సంబంధించిన అన్ని షేర్లు పతనమయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ 1.5 శాతం నష్టాన్ని చవిచూసింది. అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు ఒక్కొక్కటి దాదాపు 3 శాతానికి పడిపోయాయి. ఇక అదానీ ఎంటర్ ప్రైజెస్ 2 శాతానికి పైగాపతనమైంది. అదే విధంగాఅదానీ గ్రీన్ ఎనర్జీ కూడా 2.50 శాతం పడిపోయింది. అదానీకి మరొకసారి చీకటి రోజును మిగిల్చింది.
హిడెన్ బర్గ్ 2023 లో అదానీ గ్రూప్ లక్ష్యంగా నివేదిక విడుదల చేసింది. ఈ కంపెనీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ, తమ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. ఆ సమయంలో కూడా అదానీ సంపద వేల కోట్లు ఆవిరైంది. తాజాగా మరోసారి ఆదానీ షేర్లు వేగంగా పడిపోతున్నాయి. ఇక 2023లో అదానీ షేర్లు దాదాపు 80శాతం పడిపోయాయి. ఇక మొత్తంగా మార్కెట్ క్యాప్ దాదాపు 150 మిలియన్ డాలర్లకు పైగా నష్టం చూడాల్సి వచ్చింది.
అయితే ఈసారి అదానీ గ్రూప్ అక్రమాల్లోకి ఏకంగా సెబీ చీఫ్ ను లాగడం గమనార్హం. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నిర్వహిస్తున్న కొన్ని బెర్ముడా, మారిషస్ ఫండ్స్ కు సంబంధించి సెబ్ చీఫ్ మాధవి పురి, ఆమె భర్త ధావల్ బచ్ 2015లో పెద్ద ఎత్తన పెట్టుబడులు పెట్టారు. ఇండియా కరెన్సీ ప్రకారం సుమారు రూ. 83 కోట్ల వాటా ఇందులో ఉందని ఆరోపించింది. అయితే 2017 లో సెబీ శాశ్వత సభ్యురాలిగా ఉన్నమాధవి, ఆ తర్వాత 2022లో చైర్ పర్సన్ గా నియమితులయ్యారు.
తమ వాటాలు ఉన్నందున గతంలో అదానీ గ్రూప్ పై విచారణలో పారదర్శకత లోపించదనేది ప్రస్తుతం హిడెన్ బర్గ్ ప్రధాన ఆరోపణ. అయితే దీనిని మాధురి పురితో పాటు అదానీ గ్రూప్ ఖండించింది. ఇవి ఆధారాల్లేని అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. కానీ హిడెన్ బర్గ్ మరోసారి అదానీ గ్రూప్ నకు భారీ నష్టం చేసినట్లే కనిపిస్తున్నది. కొంత కోలుకున్నట్లు అనిపించినా ఈ కంపెనీ షేర్ల తీవ్రంగా పతనమయ్యాయి.