Double Ismart First Review: ‘డబుల్ ఇస్మార్ట్’ మొట్టమొదటి రివ్యూ..క్లైమాక్స్ ట్విస్ట్ పోకిరినే మించిపోయిందిగా!

సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు యూత్ ఆడియన్స్ థియేటర్ లో చొక్కాలు చింపుకొని డ్యాన్స్ వేసే విధంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయట

Written By: Vicky, Updated On : August 12, 2024 3:39 pm

Double Ismart First Review(1)

Follow us on

Double Ismart First Review: గత కొంతకాలం నుండి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కేవలం దర్శకత్వం మాత్రమే కాదు, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయనతో పాటుగా ప్రముఖ హీరోయిన్ ఛార్మీ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది. కానీ వీళ్లిద్దరు కలిసిన వేళావిశేషం సరిగా లేదనుకుంటా, అందుకే ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అలా సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకున్న సమయంలో చివరి ప్రయత్నంగా చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పూరీ జగన్నాథ్, ఛార్మీ కి లాభాల వర్షం కురిపించింది. తొలిసారి ఇద్దరు నిర్మాతగా సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడంతో, ఈసారి ఇంకా భారీ కొట్టాలనే ప్రయత్నంలో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా తీశారు.

ఈ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. పెట్టిన డబ్బులు మొత్తం నష్టపోవడమే కాకుండా, పూరీ జగన్నాథ్ ని నష్టపరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేసారు. అలాంటి సమయం లో మళ్ళీ ఆయన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్నే నమ్ముకున్నాడు. ఆ చిత్రానికి సీక్వెల్ గా రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ అనే చిత్రం చేసాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం లో పాటలు ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యి సినిమా మీద హైప్ ని పెంచాయో, డబుల్ ఇస్మార్ట్ చిత్రం విషయం లో కూడా అదే జరిగింది. మణిశర్మ అందించిన బాణీలు యూత్, మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. ఇకపోతే రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళ నుండి సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇది ఇలా ఉండగా లైగర్ నష్టాల కారణంగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ని కొన్ని ప్రాంతాలలో విడుదల చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించలేదు. ఇక వాళ్ళని బుజ్జగించడానికి, వారితో ఆ సినిమాని కొనిపించడానికి రీసెంట్ గానే సెన్సార్ వెర్షన్ మూవీ ని డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రసాద్ ల్యాబ్స్ లో వేసి చూపించారట. వారి నుండి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు యూత్ ఆడియన్స్ థియేటర్ లో చొక్కాలు చింపుకొని డ్యాన్స్ వేసే విధంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయట. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పోకిరి లాగ టాలీవుడ్ లో ట్రెండ్ ని సెట్ చేసే విధంగా ఉంటుందట. చూడాలిమరి ఈ చిత్రం పూరీ జగన్నాథ్ కి మరోసారి పునర్జన్మని ఇస్తుందా, లేదా ఆయనని పూర్తిగా సినిమాలకు దూరమయ్యేలా చేస్తుందా అనేది. పూరీ జగన్నాథ్ తో పాటుగా హీరో రామ్ కి కూడా ఈ సినిమా భారీ హిట్ అవ్వడం అత్యంత కీలకం.