Duvvada Srinivas : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ జంట అంటే ముమ్మాటికి గుర్తుకొచ్చేది దువ్వాడ శ్రీనివాస్, మాధురి. వీరిద్దరూ ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందారో తెలియంది కాదు. తెలుగు నాట తుఫాన్లు, వర్షాలతో ఈ జంట తగ్గింది కానీ.. లేకుంటే వీర లెవెల్లో వీర విహారం చేసేది. తెలుగు మీడియాకు ఆహారంగా మారారు కూడా వీరు. అయితే కొద్దిరోజులుగా బ్రేక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ హల్చల్ చేస్తున్నారు. సినిమా జంటకు తీసిపోని విధంగా.. తమ నటనతో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు గా మారిపోయారు. వీరిని ముందు పెట్టి టీవీ ఛానళ్లు టిఆర్పి రేటింగ్స్ పెంచుకుంటున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది.
* అదో భారీ ఈవెంట్ గా
కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఓ టీవీ ఛానల్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంటను. అచ్చం సినిమా ప్రమోషన్ లా భావించి.. అంత రేంజ్ లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో వారి మనసులో ఉన్న భావోద్వేగాలను.. రొమాన్స్ ను బయట పెట్టారు. మాధురి తన డాన్స్ తో ఉర్రూతలూగించగా… దువ్వాడ శ్రీనివాస్ తన నటనతో మెప్పించారు. సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచారు. చంద్రముఖిలో జ్యోతిక పాత్రలో మాధురి, రజనీకాంత్ మాదిరిగా దువ్వాడ శ్రీనివాస్ మారిపోయారు. అదే సమయంలో రొమాంటిక్ సాంగ్స్ కు సైతం స్టెప్పులు కలిపారు. సినిమా స్టార్స్ కు తీసిపోని విధంగా తమ అభినయంతో ఆకట్టుకున్నారు.
* కుశల ప్రశ్నలతో
సదరు టీవీ ఛానల్ ప్రతినిధులు ఒక బృందంగా ఏర్పడి.. ఆ జంటను ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. వారు అడిగిన దానికి స్పాంటేనియస్ గా సమాధానం చెప్పింది ఆ జంట. తమ బంధం చట్టబద్ధమా? కాదా అన్నదానిపై క్లారిటీ ఇచ్చింది. 60 ఏళ్ల వయసులో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కు వారసుడు వస్తాడా? అటువంటి ప్లాన్ ఏమైనా ఉందా? అని సదరు మీడియా ప్రతినిధులు అడిగిన దానికి సమాధానాలు చెప్పింది ఆ జంట. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ఆ జంట రొమాన్స్ ను చూపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత తెరపైకి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట సోషల్ మీడియాకు కనువిందు చేస్తోంది. అయితే అదే స్థాయిలో జంటపై సెటైర్లు కూడా పడుతున్నాయి. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అదే స్థాయిలో ట్రోల్ కూడా జరుగుతోంది.
చి దీనెమ్మ జీవితం … pic.twitter.com/N04cLdUy19
— JSP Naresh (@JspBVMNaresh) December 31, 2024