Homeజాతీయ వార్తలుIndian Coast Area : పెరుగుతున్న భారత సముద్ర తీరం.. ఏపీలో కూడా.. ఏం జరుగుతోంది..?

Indian Coast Area : పెరుగుతున్న భారత సముద్ర తీరం.. ఏపీలో కూడా.. ఏం జరుగుతోంది..?

Indian Coast Area : ఈ భూమి మీద మనం పుట్టడం గొప్ప వరం.. ఎన్నో జన్మల పుణ్యఫలం. భిన్నమై వాతావరణం భూమిపై ఉంటుంది. కానీ, సమ శీతోష్ణ మండలంగా పిలువబడే భారత్‌లో పుట్టడం ఇంకా గొప్ప వరం. అయితే పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రకృతి ప్రసాదాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఫలితంగా అవి కూడా ఆగ్రహిస్తున్నాయి. ఇక సముద్ర తీరం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. సాధారణంగా తుఫాన్లు, పౌర్ణమి, అమావాస్య సందర్భంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కెరటాలు ముందుకు రావడం, వెనక్కు పోవడం జరుగుతుంది. కానీ అనూహ్యంగా తీరం పెరగడం గమనార్హం. అది కూడా 48 శాతం పెరిగింది. వాస్తవానికి భారత్‌ చుట్టూ తీరం పెరగలేదు. కానీ కొలతలు పెరిగాయి. ఎలా అంటే.. ఇండియన్‌ నావల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీస్, సర్వే ఆఫ్‌ ఇండియా 1970లో భారత్‌ తీరాన్ని కొలిచాయి. అప్పటికీ ఉన్న పరికరాలతో కొలిచి మొత్తం 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు 7,516 కిలో మీటర్లుగా నిర్ణయించారు. కానీ అది నిజం కాదని తాజా లెక్కలు చెబుతున్నాయి.

ఆధునిక టెక్నాలజీతో…
50 ఏళ్లలో టెక్నాలజీ బాగా పెరిగింది. దీంతో సముద్ర తీర ప్రాంతాన్ని అత్యంత కచ్చితమైన ప్రమాణాలతో కొలిచారు. ఇదివరకు నిలువుగా మాత్రమే కొలిచారు. ఇప్పుడు ఎత్తు పల్లాలు, వంపులు, మలుపులను కూడా లెక్కలోకి తీసుకుని కొలిచారు. తాజా కొలతల ప్రకారం.. బారత తీరప్రాంతం 11,098.81 కిలోమీటర్లుగా తేల్చారు. ఈ వివరాలను కేంద్ర హోంశాఖ తాజాగా రిలీజ్‌ చేసిన 2023–24 సంవత్సర నివేదికలో పొందుపర్చింది.

ఏపీ తీరం కూడా..
ఇక తెలుగు రాష్ట్రం ఏపీలోనూ తీరం పెరిగింది. ఏపీలో ఇప్పటి వరకు 973.70 కిలోమీటర్ల పొడవు తీరం ఉంది. కానీ తాజా గణాంకాల ప్రకారం.. తీరం ఇప్పుడు 1,053.70కు పెరిగింది. పాత తీరంతో పోలిస్తే 8.15 శాతం పెరిగింది. నిజంగా అది కూడా పెరగలేదు. కొలతలు మాత్రమే పెరిగాయి. ఏపీతోపాటు తమిళనాడు తీరం కూడా 906.90 కిలో మీటర్ల నుంచి 1,068.69 కిలోమీటర్లకు పెరిగింది. ఈ కారణంగా దేశంలో అత్యధిక తీర ప్రాంతం గ రాష్ట్రంగా గుజరాత్‌ 2,340.62 కిలోమీటర్లు ఉండగా, తమిళనాడు రెండో స్థానంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానానికి పడిపోయింది. కొత్త లెక్కల ప్రకారం.. గుజరాత్‌ తీరం 92.69 శాతం పెరిగింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల తీరం 57.16 శాతం పెరిగింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version