Duvvada Srinivas: ఇప్పటివరకు సినీ సెలబ్రిటీలను( cine celebrities) మాత్రమే చూశాం. కానీ రాజకీయాల నుంచి కూడా జంట తెగ ఆకట్టుకుంటోంది. మోస్ట్ పాపులర్ జంటగా గుర్తింపు సాధించింది. ఇంతకీ ఆ జంట ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. గత కొంతకాలంగా వీరు వినోదం పంచుతూ వస్తున్నారు. దువ్వాడ కుటుంబంలో రేగిన వివాదం చివరికి సద్దుమణిగింది. మాధురితో దువ్వాడ శ్రీనివాసును ఒక్కటి చేసింది. అప్పటినుంచి తెలుగు నాట ఈ జంట పాపులర్ అయింది. అయితే ఈ జంట కొత్తగా వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఓ షాపును ప్రారంభించినట్లు సమాచారం. భారీ పెట్టుబడితో తొలుత హైదరాబాదులో ప్రారంభించిన ఈ వ్యాపారాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: విజయసాయిరెడ్డి పై గొడ్డలి వేటు పెద్ద పని కాదు.. చంద్రబాబు రక్షణ కల్పించాలి!
* బిజీ బిజీగా జంట
గత కొంతకాలంగా మీడియా ఛానళ్లతో( media channels ) పాటు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది ఈ జంట. అయితే దీని వెనుక వ్యాపార విస్తరణ ఆలోచన ఉన్నట్లు తాజాగా తేలింది. మియాపూర్ లో వకుళ సిల్క్స్ పేరిట ఒక షాపును ఏర్పాటు చేశారు. దాదాపు పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తమ వ్యాపారం విశాఖ కంటే హైదరాబాదులోనే సేఫ్ అని ఆ జంట భావించినట్లు సమాచారం. అందుకే అక్కడ షాప్ ని ఏర్పాటు చేసి.. విజయవంతం అయితే మిగతా ప్రాంతాల్లో విస్తరించాలన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది.
* బ్రాండ్ అంబాసిడర్లుగా వారే
తమ వ్యాపారానికి దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ), దివ్వెల మాధురీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వకుళ సిల్క్స్ కు సంబంధించి ప్రమోటర్ గా దివ్వెల మాధురి వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఆమెకు ఉన్నారు. పైగా స్త్రీల అలంకరణకు సంబంధించి ఆమెకు మంచి పట్టు ఉంది. చీరల కలెక్షన్ లో కూడా ఆమె ఎంతగానో గుర్తింపు పొందారు. అయితే రాజకీయాలు కంటే ఈ వ్యాపారం పైనే ఆ జంట ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇకనుంచి రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉండాలని దువ్వాడ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
* దువ్వాడ సైలెంట్
ప్రస్తుతం శాసనసభ సమావేశాలు( assembly sessions) జరుగుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ పై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. ఈ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. అందుకే రాజకీయాల కంటే వ్యాపారం నయమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే దాదాపు పది కోట్ల రూపాయలతో పెట్టిన ఈ వ్యాపారానికి సంబంధించి పెట్టుబడి ఎవరు పెట్టారు అన్నది తెలియడం లేదు.