https://oktelugu.com/

YS Jagan : దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని కలిపింది జగన్.. ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదు!

భారీ ఓటమి కంటే.. తమ పార్టీ నేతలపై వివాదాలు వైసీపీకి తలనొప్పిగా మారాయి. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి.. నిన్న దువ్వాడ శ్రీనివాస్.. ఇలా ఒక్కో వివాదం బయటపడుతోంది. పార్టీ పరువు తీస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : August 13, 2024 / 01:31 PM IST

    Duvvada And Divvela Madhuri

    Follow us on

    YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దువ్వాడ వ్యవహారమే ప్రధాన టాపిక్. వారం రోజులుగా రచ్చ నడుస్తోంది.దీనికి ఎండ్ కార్డు పడటం లేదు.అయితే శుభం ఇవ్వాలని ఇరు కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో దివ్వెల మాధురి రోడ్డుపై పడాల్సి వచ్చింది.ఇంతకీ ఆమె ఎవరు? ఎలా పరిచయం అయ్యారు? దువ్వాడతో ఎందుకు కలిశారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే వారిద్దరినీ కలిపింది మాత్రం పార్టీ అధినేత జగన్.ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్. వైసిపి ప్రభుత్వ హయాంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. తాను సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుతున్నానని..మీరు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని..సంక్షేమ పథకాలను తెలియజేయాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా ప్రజలను కలిశారు. ఈ క్రమంలో ప్రజల నుంచి నిలదీతలు,ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రాతిపదికగా తీసుకునే జగన్ ఎన్నికల్లో టికెట్లు కేటాయించారు.అయితే ఇది ఆశించినంత సక్సెస్ కాలేదు.కానీ అదే గడపగడపకు మన ప్రభుత్వం దివ్వెల మాధురిని..దువ్వాడ శ్రీనివాస్ దగ్గరకు చేర్చడం విశేషం. దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ తో పాటు టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్. ఈ క్రమంలో నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా తిరిగారు. అప్పుడే మాధురి తో ఆయనకు పరిచయం అయినట్లు తెలుస్తోంది.

    * గడపగడపకు వెళ్లి..
    టెక్కలిలో దివ్వెల మాధురి నివాసం ఉండేవారు. ఆమెకు కొన్ని రకాల వ్యాపారాలు ఉండేవి. ఆపై భరతనాట్యం టీచర్ కూడా. టెక్కలిలో గడపగడపకు మన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దువ్వాడ. ఇలా ఇంటింటికి వెళ్లే క్రమంలో తారసపడ్డారు దివ్వెల మాధురి. తన భర్త యుఎస్ లో ఉంటున్నారని.. తాను మాత్రం ఇక్కడే ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారని మాధురి చెప్పుకొచ్చారు. అలా పరిచయం అయిన మాధురి దువ్వాడ శ్రీనివాస్ కు స్నేహితురాలు అయ్యారు.

    * పార్టీలో యాక్టివ్
    వైసీపీలో యాక్టివ్ గా పని చేయాలని భావించారు మాధురి. దీనికి దువ్వాడ వాణి కూడా ప్రోత్సహించారు. వైసీపీ మహిళా విభాగాన్ని అప్పగించారు. అయితే ఆమెతో మరీ స్నేహాన్ని దగ్గరగా చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్.. ఐప్యాక్ టీం బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వైసీపీకి సేవలందించేవారు మాధురి. ఈ క్రమంలోనే ఆమె దువ్వాడ శ్రీనివాస్ కు మరింత దగ్గరైనట్లు ప్రచారం జరుగుతుంది.

    * నోరు తెరవని హై కమాండ్
    సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ విషయంలో దుమారం రేగుతున్నా వైసిపి హై కమాండ్ ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా వారిద్దరినీ కలిపింది జగన్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నడివయస్కురాలైన మాధురిని నాడు దువ్వాడ శ్రీనివాస్ చూశారని.. స్నేహం చేయడంతోనే ఈ ఇబ్బందులు వచ్చాయని స్థానికులు చెప్పుకుంటున్నారు. మొత్తానికైతే వారిద్దరినీ కలిపిన జగన్.. ఈ ఎపిసోడ్ పై మాట్లాడకపోవడం విమర్శలకు తావిస్తోంది.