YCP MP Tanuja Rani : వైసీపీకి మరో ఇబ్బంది.. హైకోర్టులో అడ్డంగా ఇరుక్కున్న అరకు ఎంపీ.. ఏం జరుగనుంది?

ఈ ఎన్నికల్లో వైసీపీకి దక్కింది కేవలం నాలుగు ఎంపీ స్థానాలే. 2019 ఎన్నికల్లో 23 స్థానాలను కైవసం చేసుకున్న వైసిపి.. 2024 వచ్చేసరికి 19 స్థానాలను వదులుకుంది. కేవలం నాలుగింటికి పరిమితం అయ్యింది.

Written By: Dharma, Updated On : August 13, 2024 1:15 pm

Thanuja Rani

Follow us on

YCP MP Tanuja Rani :వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. పార్టీ కీలక నేతలు, క్యాడర్ కూటమి వైపు చూస్తోంది. చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని రకాల కేసులు ఎదురవుతున్నాయి. అరకు వైసీపీ ఎంపీ గుమ్మ తనుజా రాణి కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ బిజెపి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు తనుజా రాణి కి నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు ఎన్నికల అధికారులకు సైతం నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఎన్నికల అఫిడవిట్లో పూర్తి వివరాలు పొందుపరచలేదన్నది తనుజారాణిపై ఉన్న ప్రధాని ఆరోపణ. దానిపైనే కొత్తపల్లి గీత కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆమె ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. గతంలో కొత్తపల్లి గీత విషయంలో సైతం ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. 2014లో ఆమె వైసీపీ తరఫున గెలిచేటప్పుడు ప్రత్యర్థులు.. ఎన్నికల అఫీడవిట్ పై కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అదే పని కొత్తపల్లి గీత ప్రత్యర్థి పై చేయడం విశేషం. వైసీపీ తరఫున నలుగురు ఎంపీలు గెలిచారు. అందులో తనుజారాణి ఒకరు. ఇప్పుడు ఆమె ఎన్నిక పైనే కోర్టును ఆశ్రయించడం విశేషం.

* కొత్తపల్లి గీత ఓటమి
అరకు ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేశారు తనుజ రాణి. పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించారు. దీంతో బిజెపి కొత్తపల్లి గీతకు ఛాన్స్ ఇచ్చింది. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే కొద్ది రోజులకే పార్టీని విభేదించారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసినగీతకు డిపాజిట్లు కూడా దక్కలేదు. పొత్తులో భాగంగా ఈసారి కలిసి వచ్చింది . అయితే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనుజరాణి చేతిలో ఆమె ఓడిపోయారు. 50 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

* గతంలో చాలా వివాదాలు
కొత్తపల్లి గీత చుట్టూ గతంలో చాలా వివాదాలు నడిచాయి. కోర్టు కేసులు కూడా కొనసాగాయి. 2014లో ఎన్నికల ఆఫిడవిట్ లో పూర్తి వివరాలు పొందుపరచలేదన్నది ఆమెపై ఉన్న అభియోగం. దీనిపై కోర్టుకు ప్రత్యర్ధులు వెళ్లారు. చాలా రోజులు కేసులు కొనసాగాయి. విచారణ సైతం జరిగింది. అప్పట్లో బాధితురాలుగా ఉన్న కొత్తపల్లి గీత.. ఇప్పుడు గెలిచిన ఎంపీ పై కోర్టుకు వెళ్లడం విశేషం.

* అది కూటమి ప్లానేనా
అయితే మరోవైపు వైసిపి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచి కూటమిలోకి తేవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. అరకు నుంచి తనుజరాణి, కడప నుంచిఅవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, తిరుపతి నుంచి మరొకరు ఉన్నారు.అయితే వైసీపీ ఎంపీలు బిజెపిలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ ఎంపీ పై బిజెపి నేత కోర్టుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.