Dussehra Holidays: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ దసరా. ప్రతి ఏడాది దసరా పండుగ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు దసరా పండుగ వస్తుందంటే ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే దసరా పండుగకు ముందు బతుకమ్మ వేడుకలు ఉంటాయి. దాదాపు పది రోజులపాటు ఈ వేడుకలను నిర్వహించుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ ఉత్సవాలు.. సద్దుల బతుకమ్మ వరకు కొనసాగుతాయి. అయితే ఈ పండుగల సందర్భంగా పాఠశాలలకు పది రోజులపాటు సెలవులు ఇస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు తెరుస్తారంటే?
పండుగల సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటినుంచి సంక్రాంతి వరకు వరుసగా పండుగలు వస్తుంటాయి. వీటిలో ప్రధానంగా దసరా, దీపావళి, సంక్రాంతి గురించి చెప్పుకుంటారు. అయితే గ్రామాల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లినవారు.. ఈ పండుగల సందర్భంగా తిరిగి తమ గ్రామాల్లోకి వెళ్లి సందడి చేస్తారు. కొన్ని రోజులపాటు ఊరు వాతావరణంలో ఉండాలని కోరుకుంటారు. అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇళ్ల బాట పట్టారు. హాస్టల్లో ఉన్న పిల్లలను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు రావడంతో పాఠశాలల్లో రద్దీగా మారింది.
మరోవైపు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో విపరీతమైన ప్రయాణికులు కనిపిస్తున్నారు. పది రోజులపాటు తమ గ్రామాల్లో సందడి చేయాలని కొందరు వెళ్తుంటే.. మహిళలు తమ పుట్టింటికి వెళ్లడానికి ప్రయాణాలు ప్రారంభించారు. ఇలా పది రోజులపాటు బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు రద్దీగా ఉండే అవకాశం ఉంది. అయితే అత్యవసర ప్రయాణాలు ఉండేవారు ఫ్రీ ప్లాన్ గా వెళ్లాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే ప్రయాణికుల రద్దీతో బస్సులు, రైల్వేలో వెళ్లడానికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా సౌకర్యంగా ప్రయాణాలు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే బస్సులు కూడా రద్దీ కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో హైదరాబాద్ లోని పలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి.
ఇంకా దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 22న పాఠశాలలు మూసివేశారు. తిరిగి అక్టోబర్ 4వ తేదీన పాఠశాలలు తెరవనున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా పది రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉండగా దేవీ నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. పది రోజులు అమ్మవారి మండపాల వద్ద కోలాటాలు ఉంటాయి. దీంతో విద్యార్థులు, మహిళలు అమ్మవారి మండపాల వద్ద సందడి చేయనున్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారి సేవలో ఉంటూ ఉపవాసాలు చేయనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విదేశాల్లో ఉండేవారు సైతం దసరా పండుగ సందర్భంగా తమ ఇళ్లల్లోకి రావడానికి ఆసక్తి చూపుతారు. దీంతో పట్టణాలు, నగరాలు ఖాళీగా కనిపించే అవకాశం ఉంది. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది.