Trump Hikes H1B Visa Fees: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి నిర్ణయాలు అమెరికన్లను, ఇటు భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. అమెరికా కంపెనీలకు శాపంగా మారుతున్నాయి. తాజాగా హెచ్–1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడం.. 24 గంటలు గడవకుండానే అది కొత్తవారికి మాత్రమే అని వైట్‌హౌస్ ప్రకటించడంతో గంగరగోళం నెలకొంది. ఈ ఆకస్మిక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ గందరగోళం కారణంగా కొందరు వ్యక్తిగత ప్రణాళికలు, ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం భారత్‌కు వచ్చే ప్రయత్నాలను రద్దు చేసుకున్నారు.
ఆగిన పెళ్లిళ్లు..
హెచ్–1బీ వీసా ఫీజు రూ.80 లక్షల వరకు పెరిగిందని చాలామంది ప్రవాస భారతీయులు భారత్‌కు వచ్చే ప్రణాళికలను వాయిదా వేశారు. దీనిపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ ఫీజు పెంపు అన్యాయం. నా తల్లి ఏడ్చింది, నేను రాలేకపోతున్నానని తెలిసి,‘ అని ఓ యువతి తన నిరాశను పంచుకుంది. ఈ గందరగోళం వల్ల కొన్ని కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు ఆగిపోయాయి. అమెరికా అధికారులు ఈ ఫీజు పెంపు కేవలం కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్‌హౌస్ స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ, ప్రకటన వెలువడిన తొలి రోజుల్లో సమాచార లోపం కారణంగా అనేకమంది తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకున్నారు. ఈ స్పష్టత ఆలస్యంగా రావడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Also Read: 24 గంటల్లో నాలుక మడతపెట్టిన ట్రంప్.. హెచ్–1బీ వీసా ఫీజులో మార్పు.. అసలేమైంది?
ఈ ఫీజు పెంపు వివాదం కేవలం ఆర్థిక సమస్యగానే కాకుండా, భావోద్వేగ సమస్యగా కూడా మారింది. పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భాల్లో కుటుంబ సభ్యులు కలవలేకపోవడం వల్ల ప్రవాస భారతీయుల మనస్తాపానికి దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి, అమెరికా వీసా విధానాలపై మరింత పారదర్శకత అవసరమని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ట్రంపుకు శాపనార్థాలు పెడుతున్నారు.