AP Liquor: ఏపీలో మందుబాబులకు ‘దసరా’ పండగే.. తక్కువ ధరకే కొత్త బ్రాండ్లు

గత ఐదేళ్లుగా ఏపీలో మద్యం విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.తాగుదామంటే మంచి మద్యం దొరకని పరిస్థితి.ధర కూడా అమాంతం. దీంతో మందుబాబులు ప్రత్యామ్నాయంగా సారా, గంజాయి పై పడ్డారు. ఈ విషయాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఏకంగా మద్యం పాలసీనిమార్చడానికి సిద్ధపడింది.

Written By: Dharma, Updated On : September 12, 2024 9:28 am

AP Liquor

Follow us on

AP Liquor : ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. మరో పక్షం రోజుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఐదేళ్లుగా మందుబాబులు పడుతున్న బాధలకు చెక్ పడనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రులతో క్యాబినెట్ కమిటీని రూపొందించింది. ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాన్ని ఈ కమిటీ అధ్యయనం చేసింది. మంచి మద్యం పాలసీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అందుబాటు ధరల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇది ఒక విధంగా మద్యం ప్రియులకు శుభవార్త.

* అటకెక్కిన నిషేధం
2019 ఎన్నికల్లో పూర్తిగా మద్యం నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యం నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రాష్ట్ర ఆదాయం దృష్ట్యా ప్రతి ఏడాది మద్య నిషేధాన్ని అమలు చేసి ఎన్నికలకు వెళ్తానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపే వీలుగా పాలసీని మార్చారు. కానీ గత ఐదేళ్లుగా మద్య నిషేధం అన్నమాట మరిచిపోయారు. అటు నాణ్యమైన మద్యాన్ని అందించలేకపోయారు.

* అంతటా జే బ్రాండ్లు
గత ఐదేళ్ల కాలంలో దేశంలో ఎక్కడా చూడని,వినని మద్యం బ్రాండ్లు ఏపీలో కనిపించాయి. ధరలు కూడా ఆకాశాన్ని ఉంటాయి. టిడిపి ప్రభుత్వ హయాంలో క్వార్టర్ మద్యం 110 రూపాయలు ఉండగా.. దానిని శత శాతానికి పెంచారు. అయితే మందుబాబులను మద్యానికి దూరం చేయడం కోసమే ధర పెంచినట్లు చెప్పుకొచ్చారు. కమీషన్ల కోసమే అడ్డగోలుగా కంపెనీలకు అనుమతులు ఇచ్చారని విపక్షాలు ఆరోపించినా పెద్దగా పట్టించుకోలేదు. కొత్త బ్రాండ్ల మద్యంతో ప్రజారోగ్యం క్షీణించినా ఖాతరు చేయలేదు. గత ఐదేళ్ల కాలంలో జే బ్రాండ్ మద్యం తాగి వేలాదిమంది చనిపోయారని విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మద్యం పాలసీని మార్చింది. అక్టోబర్ 1 నుంచి అమలు చేయనుంది. ప్రభుత్వమే నేరుగా దుకాణాలను నడుపుతుందా? లేకుంటే మళ్లీ లాటరీ సిస్టం తెస్తుందా? అన్నది తెలియాలి.

* నాటు సారా, గంజాయి కి చెక్
గత ఐదేళ్లుగా మద్యం ప్రభావం మందుబాబులపై పడింది. అనుకున్న స్థాయిలో బ్రాండ్లు లభించక పొరుగు రాష్ట్రాల మద్యంపై ఎక్కువ మంది ఆధారపడ్డారు.అదే సమయంలో నాటుసారా తో పాటు గంజాయి వినియోగం కూడా పెరిగింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి దందా బయటపడుతోంది. దీనికి కొత్త మద్యం పాలసీతో చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.