AP Assembly Election Results 2024
AP Assembly Election Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి సీట్లు సాధిస్తోంది. వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు ఆ పార్టీ అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 60 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పవన్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
సంబురాల్లో పవన్ భార్య..
ఇక హైదరాబాద్‌లో ఉన్న పవన్ భార్య అన్నా లెజనోవా, ఆయన తనకుడు అకిరా నందన్ పవన్ గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. పవన్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు రావడంతో పవన్ భార్య, తనయుడు ఇంటి బయటకు వచ్చి అభివాదం చేశారు. పవన్‌ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
#PawanKalyan wife Anna Lezhneva and son Akira Nandan acknowledges the crowd at their residence in Hyderabad. pic.twitter.com/TEu0L01wfA
— Gulte (@GulteOfficial) June 4, 2024
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: During the victory celebrations pawan kalyan wife anna lezhneva akira greeted the people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com